ఒకప్పుడు తల స్నానం చేయడానికి కుంకుడుకాయలు వాడేవారు.కానీ ఇప్పటి రోజుల్లో చాలా మందికి కుంకుడు కాయలు అంటే ఏమిటో కూడా తెలియడం లేదు.
ఆల్మోస్ట్ అందరూ షాంపూలకే అలవాటు పడిపోయారు.పైగా మార్కెట్లో రకరకాల షాంపూలు అందుబాటులోకి వచ్చాయి.
ఎవరికి నచ్చిన షాంపూ వారు కొనుగోలు చేసే వాడుతున్నారు.అయితే షాంపూ జుట్టుకు మాత్రమే ఉపయోగపడుతుందనుకుంటే పొరపాటే అవుతుంది.
నిజానికి షాంపూ తో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.హెయిర్ వాష్ కోసమే కాకుండా షాంపూ( Shampoo )ను ఇతర పనులకు కూడా ఉపయోగించవచ్చు.

బైక్, కార్ ( Bike, Car )వంటి వాహనాలను కడిగే సమయంలో షాంపూ మనకు చాలా బాగా సహాయపడుతుంది.వాటర్ లో షాంపూ వేసి వాహనాలు కడిగితే అవి తలతలా మెరిసిపోతాయి.అలాగే ఏమైనా గాయాలు అయినప్పుడు బ్యాండేజ్ వేస్తుంటారు.గాయం మానిన తర్వాత బ్యాండేజ్ తీసే క్రమంలో చాలా నొప్పి వస్తుంటుంది.అలాంటి సమయంలో షాంపూ కలిపిన నీటిని బ్యాండేజ్ పై పోసి కాసేపు వదిలేయాలి.ఆపై బ్యాండేజ్ తొలగిస్తే ఎటువంటి నొప్పి ఉండదు.
అలాగే దుస్తులపై మొండి మరకలను వదిలించడానికి షాంపూ ఉత్తమంగా ఉపయోగపడుతుంది.ముందు మరకలపై షాంపూ మరియు నిమ్మరసం కలిపి బాగా రుద్దాలి.
ఆపై డిటర్జెంట్ తో బట్టలు ఉతికితే మరకలు మాయం అవుతాయి.షాంపూను మనం షూ పాలిష్ గా కూడా ఉపయోగించవచ్చు.
ఒక చుక్క షాంపూను బూట్ల( Shoes )పై వేసి రుద్దితే చాలా శుభ్రంగా మారతాయి.షైనీ గా మెరుస్తాయి.

మురికి పట్టేసి నల్లగా మారిన పాదాలను షాంపూ కలిపిన గోరువెచ్చని నీటిలో నానబెట్టడం వల్ల అవి తెల్లగా, మృదువుగా మారతాయి.పాదాలకు ఉన్న మురికి మొత్తం తొలగిపోతుంది.అలాగే ఇరుక్కుపోయిన జిప్ కోసం షాంపూని ఉపయోగించవచ్చు.జిప్పర్పై కొంచెం షాంపూ వేసి కాసేపు వదిలేయండి.షాంపూ జిప్పర్ సులభంగా జారడానికి సహాయపడుతుంది.ఇక షాంపూను కొందరు షేవింగ్ క్రీమ్‌గా సైతం వాడతారు.