ఎముకల బలహీనత. ఇటీవల కాలంలో చాలామంది ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు.
ఇది అనుకున్నంత చిన్న సమస్య అయితే ఏమి కాదు.ఎముకలు బలహీనత అనేది చాలా ప్రమాదకరమైనది.
ఎముకలు బలహీనంగా మారడం వల్ల నొప్పులు విపరీతంగా పెరుగుతాయి.అలాగే ఎముకల సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
మణికట్టు, నడుము, తుంటి ఎముకలలో ఫ్రాక్చర్ సమస్యను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే ఎముకల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఎముకల బలహీనతను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు.అయితే ఎముకల బలహీనతను నివారించడానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.అందులో ఇప్పుడు చెప్పబోయే షేక్ కూడా ఒకటి.ఈ షేక్ ను డైట్ లో చేర్చుకుంటే ఎముకల బలహీనత సమస్యను సులభంగా నివారించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ షేక్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి వాటర్ తో ఒకటికి రెండు సార్లు కడగాలి.
ఆ తర్వాత ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఒక యాపిల్ ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ లో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, నైట్ అంతా నానబెట్టుకున్న నువ్వులను వాటర్ తో సహా వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు బెల్లం తురుము, వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేసుకోవాలి.
చివరిగా ఒక గ్లాస్ ఆవు పాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన నువ్వుల ఆపిల్ షేక్ సిద్ధమవుతుంది.
ఈ షేక్ రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ఎముకల బలహీనత సమస్యను దూరం చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.ఈ నువ్వుల యాపిల్ షేక్ ను తరచూ తీసుకుంటూ ఉంటే ఎముకలు దృఢంగా బలంగా మారతాయి.
ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి.కాబట్టి ఎముకల బలహీనత తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ షేక్ ను డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.