రేణు దేశాయ్( Renu Desai ) ఇటీవల కాలంలో సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు.ముఖ్యంగా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత తన ఇద్దరు పిల్లలు తన తండ్రి వెంటే ఉంటున్నారు.
ఈ క్రమంలోనే ఈమె అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.అయితే ఈమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసినా ఆ పోస్టుకు పాజిటివ్ కామెంట్ల కంటే నెగిటివ్ కామెంట్లు అధికంగా వస్తున్నాయి.
దీంతో తన గురించి నెగటివ్ కామెంట్లు చేసిన వారిపట్ల రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతుంటారు.
ఇక తరచూ పవన్ కళ్యాణ్ అభిమానులకు( Pawan Kalyan Fans ) రేణు దేశాయ్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తూనే ఉంటుంది.పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఆయన అభిమానులు చేసే పోస్టుల కారణంగా ఈమె ఎంతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.అయినప్పటికీ కొంతమంది నెగటివ్ కామెంట్లతో తనని మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తనని మాత్రమే కాకుండా తన పిల్లలని కూడా ట్రోల్ చేస్తున్నారని ఈమె ఎమోషనల్ అయ్యారు.
ఇలా తన గురించి ఈ స్థాయిలో ట్రోల్స్ వస్తున్న తరుణంలో తాను ఇకపై భరించలేనని అందుకే ట్విట్టర్( Twitter ) అలాగే ఫేస్ బుక్( Facebook ) నుంచి తాను తప్పుకుంటున్నానని ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియచేశారు.ఇక తాను ఇంస్టాగ్రామ్ లో మాత్రమే అందుబాటులో ఉంటానని తెలిపారు.అయితే నా మంచి కోరిన కొందరు సలహాలు మేరకు ఇంస్టాగ్రామ్ వాడుతున్నానని అంతేకాకుండా నేను చేసే సేవ కార్యక్రమాల కోసం ఇంస్టాగ్రామ్ ఉపయోగించాల్సి రావడంతో ఇంస్టాగ్రామ్ లో మాత్రమే అందుబాటులో ఉంటున్నానని ట్విట్టర్, ఫేస్ బుక్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.