ఆ ప్రక్షాళన సీమ నుంచే మొదలు పెడుతున్న జగన్ 

వైసిపి అధినేత జగన్( jagan ) పార్టీ ప్రక్షాళన పై ఇప్పుడు పూర్తిగా ఫోకస్ చేయాలని నిర్ణయించుకున్నారు.2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారం చేపట్టి , దాదాపు రాయలసీమ జిల్లాల్లో ఒక సీటు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో విజయం సాధించారు.కానీ 2024 ఎన్నికల్లో 175 స్థానాలు కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం,  వైసీపీకి కంచుకోట గా ఉన్న రాయలసీమ జిల్లాల్లోనూ ఎదురుదెబ్బ తగలడం,  టిడిపి( TDP ) పుంజుకోవడం వంటివన్నీ జగన్ ను ఆలోచనలో పడేశాయి .వాటిని ప్రక్షాళన చేయాలని , పార్టీ పదవుల్లోనూ మార్పు చేర్పులు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.ఇప్పటికే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో జగన్ సమావేశం అయ్యారు.

 Jagan Is Starting From That Cleansing Area, Ysrcp, Tdp, Janasena, Pavan Kalyan,-TeluguStop.com
Telugu Ap Cm Jagan, Ap, Jagan, Jagan Area, Janasena, Janasenani, Pavan Kalyan, Y

జిల్లాల వారీగా పార్టీలో చేపట్టాల్సిన మార్పు చేర్పుల గురించి చర్చిస్తున్నారు.ముందుగా రాయలసీమ జిల్లాల( Rayalaseema Districts ) నుంచే ప్రక్షాళన మొదలు పట్టాలని జగన్ నిర్ణయించుకున్నారు .ఈ మేరకు పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకునే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారు.ఎన్నికల్లో వైసిపి ఓటమి చెందిన తర్వాత మొదటిసారిగా పులివెందులకు జగన్ వెళ్లారు.మరో నాలుగు రోజులు పాటు అక్కడే ఉండబోతున్నారు .ఈ సందర్భంగా కుటుంబ వ్యవహారాలతో పాటు , పార్టీకి సమావేశాల్లోనూ జగన్ పాల్గొంటున్నారు.  వైసీపీక కంచుకోటగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో పార్టీపై ఎందుకు వ్యతిరేకత వచ్చింది ? క్యాడర్ లో ఉన్న అసంతృప్తికి కారణం ఏమిటి  ? ఇలా అనేక అంశాలపై జగన్ పార్టీ నేతలతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Jagan, Jagan Area, Janasena, Janasenani, Pavan Kalyan, Y

 పులివెందుల కేంద్రంగా రాయలసీమ జిల్లాలలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీకి వచ్చిన ఓట్లు , ఓటమికి గల కారణాలను పార్టీ నేతలతో చర్చించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.  ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వైసీపీలో భారీ ప్రక్షాళన చేపట్టి , జనాల్లోకి పార్టీని తీసుకువెళ్లే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube