ప్రస్తుతం మనకు అందుబాటులో ఎన్నో రకాల నూనెలో ఉన్నాయి.అందులో నువ్వుల నూనె( Sesame oil ) కూడా ఒకటి.
ఆరోగ్యానికి మంచిదనే కారణంతో చాలా మంది ఏడాది పొడవునా నువ్వుల నూనెను వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విషయాలను తప్పక తెలుసుకోండి.నువ్వుల నూనెను శతాబ్దాలుగా వాడుతున్నారు.
నువ్వుల నూనె చక్కటి రుచిని మరియు అనేక విలువైన పోషకాలను కలిగి ఉంటుంది.ఆరోగ్యపరంగా నువ్వుల నూనెను కొట్టింది మరొకటి ఉండదు.
కానీ ఏడాది పొడవునా నువ్వుల నూనె తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.చలికాలంలో వంటలకు వాడేందుకు నువ్వుల నూనె ఉత్తమమైన ఎంపికగా చెప్పుకోవచ్చు.అలాగే వర్షాకాలంలో కూడా నువ్వుల నూనెను పరిమితంగా వాడొచ్చు.కానీ వేసవికాలంలో మాత్రం నువ్వుల నూనెను దూరం పెట్టడం మంచిది.శరీరాన్ని వెచ్చగా ఉంచే గుణం నువ్వుల నూనెకు ఉంది.అందువల్ల వేడి వాతావరణంలో నువ్వుల నూనెను వాడితే బాడీ మరింత హీటెక్కి అనేక సమస్యలు తలెత్తుతాయి.
కాబట్టి చలికాలం మరియు వర్షాకాలంలో మాత్రమే వంటలకు నువ్వుల నూనెను ఎంపిక చేసుకోండి.
ఇక నువ్వుల నూనెతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు నిత్యం నువ్వులను తీసుకోవడం ఎంతో మేలు.నువ్వుల నూనె కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గుండె సంబంధిత జబ్బులకు( Heart Disease ) అడ్డుకట్ట వేస్తుంది.నువ్వుల నూనెలో ఉండే టైరోసిన్ అనే అమినో యాసిడ్, మెదడుకు అవసరమైన ఎంజైమ్‌లు మరియు హార్మోన్లను అందిస్తుంది.
ఫలితంగా డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.అంతేకాదు నువ్వుల నూనెను వాడడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
అధిక రక్తపోటు సమస్య దూరం అవుతుంది.నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు.
ప్రీమెచ్యూర్ హెయిర్ గ్రేయింగ్‌ను సైతం నువ్వుల నూనె నివారిస్తుంది.