శరీరంలో అధిక వేడిని క్షణాల్లో మాయం చేసే మ్యాజికల్ డ్రింక్ ఇది.. రోజూ తాగితే మరెన్నో బెనిఫిట్స్!

ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్ లో అధిక ఎండల కారణంగా శరీర ఉష్ణోగ్రతలు( Body temperatures ) భారీగా పెరిగిపోతాయి.

 This Magical Drink Helps To Remove Excessive Heat In The Body! Body Heat , Body-TeluguStop.com

అందుకే ఇంట్లో అప్పుడప్పుడు ఎవరో ఒకరు శరీరంలో వేడి ఎక్కువ అయిందని అంటుంటారు.శరీరంలో అధిక వేడి కారణంగా తీవ్రమైన తలనొప్పి, బాడీపెయిన్స్, కళ్ళు మంటలు తదితర సమస్యలన్నీ తలెత్తుతుంటాయి.

దీంతో శరీరంలోని అధిక వేడిని తగ్గించుకునేందుకు ప్రయస్తుంటారు.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ డ్రింక్ శరీరంలోని అధిక వేడిని క్షణాల్లో మాయం చేస్తుంది.అలాగే ప్రస్తుత సమ్మర్ సీజన్ లో ఈ డ్రింక్ ను రోజు తాగితే మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.

మ‌రి ఇంత‌కీ ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు( Sabja seeds ) వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి.

Telugu Tips, Latest, Magical-Telugu Health

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పెరుగు( curd ) వేసి హ్యాండ్ బ్లెండర్ సహాయంతో ఒక నిమిషం పాటు మిక్స్ చేయాలి.ఆ తర్వాత అందులో నానబెట్టుకున్న సబ్జా గింజలు వేయాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ సాల్ట్‌, రెండు టేబుల్ స్పూన్లు పటిక బెల్లం పొడి( Alum jaggery powder ) వేసుకోవాలి.చివరిగా రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, నాలుగైదు ఐస్ క్యూబ్స్( Ice cubes ), రెండు గ్లాసుల వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

తద్వారా మన డ్రింక్ సిద్ధం అవుతుంది.

Telugu Tips, Latest, Magical-Telugu Health

వేసవికాలంలో ఈ డ్రింక్ ను రోజుకు ఒక గ్లాస్ చొప్పున‌ తీసుకుంటే శరీరంలో అధిక వేడి అనేదే ఉండదు.బాడీ హీట్ ను నార్మల్ చేయడానికి ఈ డ్రింక్ గ్రేట్ గా సహాయపడుతుంది.అలాగే రోజు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటారు.

వడదెబ్బ తగలకుండా ఉంటుంది.అలాగే వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.

నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రోజంతా శక్తివంతంగా ఉంటారు.

రక్తపోటు అదుపులో ఉంటుంది.గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

మరియు తలనొప్పి నుంచి క్షణాల్లో రిలీఫ్ పొందడానికి కూడా ఈ డ్రింక్ హెల్ప్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube