ఇచ్చిన వడ్డీలు కూడా వసూలు చేసుకోలేక.. కాలు కూడా తీసేయడం తో ..చివరికి ..?

చాలామంది గొప్ప గొప్ప నటీమణులు చివరి కాలంలో చాలా దీనమైన స్థితిలో కన్నుమూస్తూ ఉంటారు.సావిత్రి ఆంటీ ఎంతోమంది నటులు అదే దోవలో ఈ లోకం నుంచి నిష్క్రమించారు.

 Untold Story About Actress Chayadevi , Actress Chayadevi , Deenabandhu ,gundam-TeluguStop.com

ఒకప్పుడు సూర్యకాంతం కి పోటీగా సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఎంతో మంచి స్టార్డం అనుభవించిన నటి ఛాయాదేవి.సూర్యకాంతానికి సరి సమానంగా గయ్యాలి పాత్రలను పోషించిన ఏకైక నటీమణిగా ఈమె గుర్తింపు దక్కించుకుంది.

మచిలీపట్నంలో పుట్టిన ఛాయాదేవి( actress chayadevi ) గుంటూరులో పెరిగింది సినిమాల్లోకి రాకముందు నటి నిర్మలమ్మ తో కలిసి నృత్య ప్రదర్శనలు ఇచ్చేది.ఆ తర్వాత సినిమాల్లో నటించాలని కోరిక కలిగి మద్రాస్ కు చేరుకుంది.

Telugu Deenabandhu, Diabetes, Gundamma Katha, Guntur, Tollywood, Nagayya-Movie

మొదటిసారిగా ఆమె 1942లో దీనబంధు( Deenabandhu ) అనే సినిమాతో రంగ ప్రవేశం చేసింది.ఆ తర్వాత అనేక చిన్నారి చేతుల పాత్రలు వేస్తూనే వచ్చింది.ఇక చిత్తూరు వి నాగయ్య సంస్థలో ఆమె మెస్ ఇన్చార్జిగా కూడా చాలా కాలం పని చేసింది.ఆ తర్వాత ఆమెలోని నటిని గుర్తించిన కన్నాంబ తానే నిర్మాతగా చేసిన లక్ష్మీలో మంచి గుర్తింపు కలిగిన పాత్ర ఇచ్చి ఎంతగానో ప్రోత్సహించింది.

ఆ తర్వాత వరుసగా అనేక సినిమాల్లో నటించిన ఛాయాదేవి గుండమ్మ కథ సినిమాలో సూర్యకాంతానికి ప్రత్యర్థిగా నటించి దుర్గమ్మ పాత్రలో జీవించింది.

Telugu Deenabandhu, Diabetes, Gundamma Katha, Guntur, Tollywood, Nagayya-Movie

వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి.ఇక చాయ దేవి వడ్డీ వ్యాపారం చేసేవారు.సినిమాలు తీస్తున్న నిర్మాతలకు ఆమె ఎక్కువగా ఫైనాన్స్ ఇచ్చేవారు.

భారీ పెట్టుబడులను కూడా ఆమె సమకూర్చే అంత సత్తా ఉన్న వ్యక్తి.అయితే ఆమెకు పిల్లలు లేకపోవడంతో ఒక పాపను పెంచుకుంది.

ఆమె రెండేళ్ల వయసులోనే అనుమానాస్పదంగా కన్ను మూసింది.ఆ తర్వాత మరో పాపను పెంచుకుంది.

చివరి రోజుల్లో ఆమెకు షుగర్ వ్యాధి( Diabetes ) సోకడం తో ఒక కాలు తీసేయాల్సి వచ్చింది.ఆమెకు డబ్బులు ఇవ్వాల్సిన వారు ఎవ్వరు కూడా ఇవ్వలేదు వడ్డీలకు తీసుకెళ్లిన వారందరూ ఎగ్గొట్టేశారు.

ఇక 1983లో దీనమైన స్థితిలో అనాధగా కన్ను మూసింది ఛాయాదేవి.ఆమె జీవించి ఉన్న కాలంలో కానీ మరణించిన తర్వాత కానీ ఎవ్వరూ ఆమె గురించి ఎక్కువగా పట్టించుకోలేదు.

ఆమె సమకాలీనురాలైన సూర్యకాంతానికి దక్కిన పేరు ప్రఖ్యాతలు కూడా ఛాయాదేవికి దక్కలేదు.మీడియా ఫోకస్ ఏ రోజు ఆమెపై జరగలేదు దాంతో ఛాయాదేవి గురించి ప్రపంచానికి చాలా తక్కువ విషయాలు మాత్రమే తెలుసు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube