ఆ ఏరియాలో మహేష్, ప్రభాస్ కంటే ఎన్టీఆర్ తోపు.. దేవర రైట్స్ తో టాప్ లో నిలిచాడుగా!

టాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉన్నా కొన్ని ఏరియాలలో కొంతమంది హీరోలకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది.అలా సీడెడ్ ఏరియాలలో మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు ఎన్టీఆర్( NTR ) పేరు సమాధానంగా వినిపిస్తుంది.

 Junior Ntr Is Top Than Mahesh Babu And Prabhas Details, Ntr, Devara Movie, Devar-TeluguStop.com

సీడెడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తారక్ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

మహేష్ గుంటూరు కారం( Guntur Kaaram ) మూవీ సీడెడ్ హక్కులు 15 కోట్ల రూపాయలకు అమ్ముడవగా సలార్ మూవీ( Salaar ) సీడెడ్ హక్కులు మాత్రం 24 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.అయితే తారక్ దేవర సినిమా( Devara ) సీడెడ్ హక్కులు మాత్రం ఏకంగా 25 కోట్ల రూపాయలకు అమ్ముడవడం కొసమెరుపు.

దేవర సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయో చెప్పడానికి ఇదే సాక్ష్యమని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Devara Fear, Devara, Devara Seeded, Guntur Kaaram, Ntr, Mahesh Babu, Prab

దేవర సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫియర్ సాంగ్ కు ( Fear Song ) ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.దేవర సినిమా రిలీజ్ కు మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ ను ఇప్పటించే మొదలుపెట్టాల్సిన అవసరం అయితే ఉంది.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న తారక్ ఇకపై కెరీర్ పరంగా గ్యాప్ వచ్చే ఛాన్స్ లేదని ఫ్యాన్స్ కు హామీ ఇస్తున్నారు.

Telugu Devara Fear, Devara, Devara Seeded, Guntur Kaaram, Ntr, Mahesh Babu, Prab

ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా రిలీజయ్యేలా తారక్ కెరీర్ ప్లాన్స్ ఉండగా తారక్ ప్లాన్ చేసుకున్న విధంగా సినిమాలు విడుదలవుతాయేమో చూడాల్సి ఉంది.తారక్ పారితోషికం భారీ స్థాయిలో ఉండగా వరుస సినిమాలు తారక్ కు కెరీర్ పరంగా ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో చూడాల్సి ఉంది.ఎన్టీఆర్ దేవర రైట్స్ తో టాప్ లో నిలిచాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube