వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Chiranjeevi New Look From Vishwambhara Details, Vishwambhara, Chiranjeevi, Tolly-TeluguStop.com

ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు చిరు.అంతే కాకుండా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.

ఇది ఇలా ఉంటే చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంభర.( Vishwambhara ) ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే విశ్వంభర సినిమాకు సంబంధించి చిరంజీవి లుక్( Chiranjeevi Look ) అఫీషియల్ గా రిలీజ్ కాలేదు కానీ విశ్వంభర సెట్స్ లో ఆయన కొందరిని కలవాల్సి వస్తోంది.ఆ తరుణంలో, బయటికొస్తున్న ఫొటోల్లో చిరు లుక్ చూసి చిందులేస్తున్నారు అభిమానులు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) చిరంజీవిని కలిసిన సందర్భంలోను, ఇతర రాజకీయ నాయకులు చిరంజీవి చెంతకి వెళ్లిన సమయంలోను ఆ ఫొటోస్ రాక అనివార్యమైంది.

విశ్వంభరలో చిరు లుక్ కనువిందు చేసేస్తోంది.విశ్వంభర కోసం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అప్పటినుంచే సెన్సేషన్ క్రియేట్ చేసేసిన మెగాస్టార్ చిరు ఇది నీకే సాధ్యం గురు అనిపించేస్తున్నారు.విశ్వంభర సినిమాలో చిరంజీవి లుక్ చూసిన చాలామంది సీనియర్ జర్నలిస్ట్ లు, సినీ విశ్లేషకులు జగదేక వీరుడుతో పోల్చుతున్నారు.బింబిసార అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వశిష్ఠ( Vasishta ) చిరంజీవిని మరోమారు జగదేక వీరుడుగా చూపుతాడని నమ్ముతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube