మణిపూర్ లో భూకంపం..!!

గత ఏడాది మణిపూర్ లో( Manipur ) దారుణమైన అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే.ఆ రాష్ట్రంలో రెండు తెగలకి చెందిన ప్రజలు ఒకరిపై మరొకరు దారుణంగా దాడులు చేసుకోవడం జరిగింది.

 Earthquake In Manipur Details, Earthquake , Manipur, Manipur Earthquake, Meitei,-TeluguStop.com

దీంతో కొన్ని వేల కేసులు నమోదు అయ్యాయి.ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో 144 సెక్షన్ అమలులో ఉంది.

మణిపూర్ లో జరిగిన హింసాత్మక ఘటనల కారణంగా 200 మంది చనిపోయారు.వేలమంది తమ ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.

ఈ అలర్ల వల్ల ఇప్పటికి 50వేల మంది బాధితులు ఇంకా శరణార్థి శిబిరాలలో బిక్కు బిక్కు మంటూ తలదాచుకుంటున్నారు.మైతీ,( Meitei ) కుకీ( Kuki ) రెండు సామాజిక వర్గాలకి సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో జరుగుతున్న ఈ అల్లర్లలో చాలామంది చనిపోతున్నారు.

హింస మొదలైన నాటి నుంచి ఒక వర్గం వారు మరో వర్గానికి చెందిన ప్రాంతానికి వెళ్లలేని బీకరమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.పరిస్థితి ఇలా ఉండగా బుదవారం మణిపుర్ లో భూకంపం( Earthquake ) ప్రకంపనలు రేపింది.బిష్ణుపుర్ లో రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.5గా నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది.25 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది.దీంతో మణిపూర్ రాష్ట్రంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఈ ప్రభావం పొరుగు దేశాలైన మయన్మార్, బంగ్లాదేశ్ లోనూ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై సమాచారం లేదు.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube