కెనడాకు చెందిన జస్టిన్ స్టీవెన్సన్( Justin Stevenson ), ఆయన భార్య డానియెల్లే డేనియల్స్-స్టీవెన్సన్‌లు( Danielle Daniels-Stevensons ) మే 14వ తేదీ రాత్రి ఫోర్ట్ అలెగ్జాండర్ గుండా వెళ్తుండగా ఆశ్చర్యపరిచే దృశ్యాన్ని చూశారు.వారు వింనిపెగ్ నది పైన మెరుస్తున్న రెండు ప్రకాశవంతమైన వస్తువులను గుర్తించారు.
ఆ వస్తువులు ఎండలానే చాలా బ్రహ్మండంగా వెలుగుతున్నాయి.అవి నది ఉత్తర తీరం పైన దక్షిణం వైపుకు వెళ్లగానే మేఘాల వెనుక దాచేసుకున్నాయి.
గతంలో గ్రహాంతర ఉనికిని నమ్మని స్టీవెన్సన్, ఈ అనుభవాన్ని అత్యద్భుతంగా ఉందని అభివర్ణించారు.అవి సైన్స్ ఫిక్షన్ సినిమాలోని దృశ్యంలా ఉందని ఆయన అన్నారు.ఆ వస్తువులు ఆకాశంలో మంటలా వెలుగుతున్నాయని ఆయన వర్ణించారు.ఆయన ఈ సంఘటనను వీడియో తీశారు.
అవి ఏలియన్ల వాహనాలు కావచ్చని ఊహించారు.
ఈ వస్తువులు చాలా వేగంగా కదులుతూ, చాలా ఎత్తులో ఉన్నాయి.వస్తువులు ఎంత ప్రకాశవంతంగా ఉన్నాయో స్టీవెన్సన్ సూర్యునితో పోల్చాడు.వస్తువులు మేఘాల వెనుకకు అదృశ్యమయ్యే ముందు, దక్షిణం వైపుకు వెళ్లాయని ఈ అనుభవం ఆశ్చర్యపరిచిందని స్టీవెన్సన్ అన్నారు.
ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది, చాలా చర్చలకు దారితీసింది.కొంతమంది వీడియోలోని వస్తువులు UFOలు అని నమ్ముతారు, మరికొందరు అవి డ్రోన్‌లు లేదా ఇతర విమానాలు అని పేర్కొన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో కెనడాలో UFO దృశ్యాల( UFO sightings in Canada ) సంఖ్య పెరుగుతోంది.2023లో, కనీసం 17 UFO సైటింగ్స్ రిపోర్ట్ అయ్యాయి.ఈ సైటింగ్స్‌ను చాలా వరకు విమానయాన సంస్థల సిబ్బంది నివేదించింది.అయితే వారి చూసినవి ఏంటనేవి ఎవరూ ఇంకా నిర్ధారించలేకపోయారు.ఈ లింకు https://www.facebook.com/share/v/hsUrYCrAkEGhwFNg/?mibextid=xfxF2iపై క్లిక్ చేసి ఆ వీడియోను చూడవచ్చు.