బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ( Deepika Padukone )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గత కొద్ది రోజులుగా టాలీవుడ్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దీపికా పేరు పెద్ద ఎత్తున వినిపిస్తున్న విషయం తెలిసిందే.
దీపికా స్ట్రైట్ గా తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా కల్కి.ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే దీపిక గర్భం దాల్చిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో కూడా దీపిక గర్భవతి గానే కనిపించింది.
పైగా భగవంతుని గర్భంలో మోస్తున్న తల్లిగాను తన పాత్రను ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు నాగ్ అశ్విన్.మొదటి భాగంలో భగవంతునికి జన్మనివ్వకపోయినా రెండో భాగంలో సుమతి పాత్ర ప్రసవాన్ని చూపిస్తారని అభిమానులు భావిస్తున్నారు.దీపికకు జన్మించే భగవాన్ కల్కి అని అంతా ఊహిస్తున్నారు.కాగా ఆసక్తికరంగా పెద్ద తెరపై గర్భిణిగా కనిపించిన దీపిక యాధృచ్ఛికంగా నిజ జీవితంలో కూడా గర్భిణి కావడంతో తనకు పుట్టబోయే బిడ్డ ఒకవేళ మగపిల్లాడు అయితే అతడికి కల్కి అని పేరు పెట్టుకుంటుందా? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
తన బిడ్డ కడుపులో ఉండగానే, కల్కి లాంటి పాన్ వరల్డ్ సినిమాలో నటించిన దీపిక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ ఆనంద సమయాన కల్కి భగవంతుని నామధేయాన్ని సెంటిమెంట్ గా పరిగణిస్తుందని, తన బిడ్డకు ఇదే పేరు పెట్టుకుంటుందని కూడా అభిమానులు విశ్లేషిస్తున్నారు.మరి ఈ విషయంపై దీపికా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.