వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి షాకింగ్ పోస్ట్ పెట్టిన విదేశీ మహిళ..??

ఆఫీసుల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది.డెడ్‌లైన్‌లను పూర్తి చేయడానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

 A Foreign Woman Posted A Shocking Post About Work-life Balance, Corporate Enviro-TeluguStop.com

చాలా మంది తమ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇచ్చి, వాటి కోసం తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తారు.సెలవుల్లో, ప్రయాణంలో, లేదా రాత్రి పొద్దుపోయే వరకు, వారాంతాల్లో కూడా పనిచేస్తూ ఉంటారు.

ఇటీవల, ఒక కార్పొరేట్ ఉద్యోగి మోడ్రన్ ఆఫీస్ కల్చర్ ప్రభావం గురించి తన అనుభవాలను ఎక్స్‌ ప్లాట్‌ఫామ్ లో పంచుకున్నారు.ఆమె తన పని రోజు 12 గంటలకు పైగా ఉంటుందని, దీనివల్ల తనకు “సెల్ఫ్ లవ్” ( Self Love )కోసం సమయం లేదని వాపోయారు.

వ్యక్తిగత ఆసక్తులకు, విశ్రాంతికి సమయం లేకపోవడం వల్ల తన జీవితం ఒక “చనిపోయిన బొమ్మ” లాగా ఉందని ఆమె వివరించారు.ఈమె ఒక విదేశీయురాలు అని తెలుస్తోంది.

నిజం చెప్పాలంటే ఈ ఉద్యోగిని( employee ) అనుభవమే చాలా మంది ఎదుర్కొంటున్నారు.ఆఫీసు పని ఒత్తిడి, దాని దుష్ప్రభావాలు గురించి చర్చించాల్సిన అవసరం ఉంది.ఆ ఉద్యోగిని తన రోజు వ్యవహారాలను కూడా పంచుకున్నారు.ఆమె ఉదయం 6 గంటలకు లేచి, 7:30 కి బయలుదేరి, 9:30కి ఆఫీసుకు చేరుకుంటుందట.సాయంత్రం 6 లేదా 7 గంటలకు ఆఫీసు నుంచి బయలుదేరి, ఇంటికి రాత్రి 9:15కి ఇంటికి వెళ్తారు.అన్నం తిని, 11 గంటలకు పడుకుంటారు మరుసటి రోజు ఉదయం నిద్ర లేవడానికి ఇలా చేయాల్సి వస్తుంది.

ఆమె పోస్ట్ చాలా మందిని ఆకర్షించింది.312,000 కంటే ఎక్కువ వ్యూస్, అనేక వ్యాఖ్యలు వచ్చాయి.చాలా మంది తాము వర్క్ చేసేటప్పుడు ఎలా అనుభూతి చెందుతున్నామో పంచుకున్నారు.ఒక వ్యక్తి కార్పొరేట్ సంస్కృతి ఎంత హానికరమో, అది ఎలా వ్యక్తిగత జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో తగ్గించేస్తుందో వివరించారు.

మరొకరు ఆర్థిక స్వాతంత్ర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాకుండా, మన సమయాన్ని మనం నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా అని చెప్పారు.

ఇంటికి వచ్చాక అలసటతో ఏమీ చేయలేనని, పడుకోవడమే తన ఆత్మ సంరక్షణ అని మరొకరు పోస్ట్ చేశారు.మరొకరు దీన్ని “ఆధునిక బానిసత్వం” అని పిలిచారు.ఇది కార్పొరేట్ వర్క్ స్ట్రెస్ లైఫ్ ను ఎంతగా దెబ్బతీస్తుందో తెలియజేస్తుంది.

ఇన్ని వ్యాఖ్యలు చూసి ఆ మహిళా ఉద్యోగిని బాధపడ్డారు.ఎందుకంటే చాలా మంది తన అనుభవాన్ని అర్థం చేసుకున్నారు.

కానీ, ఆశాభావంతో కూడా ఓ సందేశాన్ని పంచుకున్నారు.మోడ్రన్ ఆఫీస్ కల్చర్‌లో సవాళ్లు ఉన్నా, పరిస్థితులు మెరుగుపడతాయని, మనం మళ్లీ మనల్ని మనం కనుగొనగలమని ఆమె ఆశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube