గత వైసిపి( YCP ) ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటిషన్ బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) ప్రస్తుత టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ బొత్స మాట్లాడిన తీరుపై అనేక అనుమానాలు రక్తం అవుతున్నాయి.
నిన్న మీడియా సమావేశంలో బొత్స అనేక ఆసక్తికర కామెంట్స్ చేశారు.టిడిపి( TDP ) ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు మాత్రమే అయ్యిందని ఆ పాలనపై తాను ఇప్పుడే విమర్శలు చేయనని బొత్స అన్నారు.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం 4000 పెన్షన్ ఇవ్వడం మంచిదేనంటూ ప్రశంసించారు. ఇక మిగిలిన హామీలను కూడా అమలు చేసే శక్తి వారికి రావాలని తాను కోరుకుంటున్నాను అంటూ వ్యాఖ్యానించారు.
ఇక వీసే ల రాజీనామాల అంశం పైన బొత్స స్పందించారు.వీసీల రాజీనామాలను ప్రభుత్వం కోరడం తప్పు కాదని వ్యాఖ్యానించారు.
వైసిపి కార్యాలయాల్లోకి కూటమి నేతలు చొరబడితే తప్పు అని అన్నారు. గతంలో టిడిపి ఆఫీసులపై తమ పార్టీ నేతలు చేసిన దాడి కూడా తప్పు అని, బొత్స వ్యాఖ్యానించారు. ఏపీలో ఉభయ పక్షాల వారు సమన్వయం పాటించాలని బొత్స విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజన వల్ల కలిగే నష్టం కంటే జగన్ ( Jagan )పాలన వల్లే నష్టం ఎక్కువైందని అంటున్నారని, ఎప్పుడు నష్టం జరిగింది ఎప్పుడు లాభం జరిగిందనేది లెక్కల్లో తేలుతుంది అంటూ తనదైన శైలిలో అన్నారు.
తనపై వస్తున్న ఆరోపణ అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు బొత్స నిరాకరించారు.అయితే టిడిపి కూటమి ప్రభుత్వానికి బొత్స అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలు ఏమిటి అనేది రాజకీయ వర్గల్లో చర్చనీయాంశం గా మారింది .
గత వైసిపి ప్రభుత్వం లో మంత్రిగా ఉన్న బొత్స శాఖల్లో అవినీతికి పాల్పడ్డారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న క్రమంలో బొత్స మెల్లిమెల్లిగా యూటర్న్ తీసుకుంటున్నారా అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.