భారతదేశ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.దీనివల్ల ప్రజలు బయటకి వెళ్ళలేకపోతున్నారు ఇక తప్పని పరిస్థితిలో వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకుని బయటికి వెళ్తున్నారు.
పొలాలకు వెళ్లేవారు ఈ సమయంలో ఎక్కువ తీసుకుంటుంది.ఎటువైపు నుంచి ఏ ముప్పు వస్తుందో ఊహించలేని పరిస్థితి.
ఇక ఈ కాలంలో పాములు బయటికి వచ్చేస్తుంటాయి.పాము కాట్లకు గురయ్యే వారి సంఖ్య ఎక్కువే.
ఒక మహిళ కూడా వర్షం నుంచి తప్పించుకోవడానికి చెట్టు కింద పోయి చివరి పాము కాటు దిగురాయి చనిపోయింది.ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం, కలబురగి జిల్లా, చిత్తాపూర్ తాలుకాలోని సూగురు గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ విలేజ్ కు చెందిన విజయలక్ష్మి తెలగేరి ( Vijayalakshmi Telageri )అనే 44 ఏళ్ల మహిళ రోజువారీ కూలి పనులకు వెళ్లి, తిరిగి వస్తున్నప్పుడు ఒక విషపూరిత పాము కాటుకు గురై మృతి చెందింది.ఆమె పొలంలో పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో వర్షం వచ్చింది.ఆ వర్షంలో తడవకూడదని ఆమె ఒక చెట్టు కింద ఆశ్రయం పొందింది.ఆ చెట్టు కొమ్మల పైన ఒక విషపూరితమైన పాము ఉన్న విషయాన్ని ఆమె గమనించలేదు.
ఆ విషయం గ్రహించే లోపే ఆ చెట్టుపై ఉన్న పాము( snake ) ఆమె చెవిని కరిచింది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు.
కానీ చికిత్సకు ముందే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈమె మరణాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.నిన్న ఎంతో సంతోషంగా ఉన్న ఆమె ఈరోజు లేదనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు.ఇలాంటి విశాఖ కరమైన సంఘటనలు ఎవరి ఇంట్లో చోటు చేసుకోకూడదని కోరుకుంటున్నారో పరిసరాల్లోని పాముల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.