ఆరోగ్యమే మహాభాగ్యం.ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం సరిగ్గా లేకుంటే ఏదో కోల్పోయినట్లే ఉంటుంది.అందుకే ఎన్ని పనులు ఉన్నప్పటికీ.ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు ఎప్పుడూ సూచిస్తుంటారు.అయితే డైట్‌లో పోషకాహారం చేర్చుకున్నా, రోజూ వ్యాయామాలు చేస్తున్నా.కొందరిని గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు మాత్రం తరచూ వేధిస్తూ ఉంటాయి.
జీర్ణ వ్యవస్థ పని తీరు తగ్గడం వల్లే ఆయా సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది.అందుకే జీర్ణ వ్యవస్థను చురుగ్గా మార్చుకోవడం ఎంతో ముఖ్యం.
అందుకు కొన్ని కొన్ని ఫుడ్స్ అద్భుతంగా సహాయపడతాయి.మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలియాలంటే లేట్ చేయకుండా కిందకు ఓ లుక్కేసేయండి.
ఓట్స్.వెయిట్ లాస్ కు మాత్రమే కాదు జీర్ణ వ్యవస్థకూ చాలా మేలు చేస్తాయి.ఓట్స్‌లో పుష్కలంగా ఉండే ఫైబర్ మరియు ఇతర పోషకాలు జీర్ణ వ్యవస్థ చురుకుదనాన్ని అద్భుతంగా పెంచుతాయి.కాబట్టి, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ ను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గోధుమలు.జీర్ణ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటే వీటిని ఖచ్చితంగా తినాల్సిందే.
ముఖ్యంగా వైట్ రైస్‌కు బదులుగా గోధుమలను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ పని తీరు సూపర్‌గా పెరుగుతుంది.బ్లూబెర్రీస్.
ఇవి రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.అందులోనూ తరచూ జీర్ణ సమస్యలతో బాధ పడే వారు వీటిని డైట్‌లో చేర్చుకుంటే.
ఆయా సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

ఫిష్ ఆయిల్.జీర్ణ వ్యవస్థ పని తీరును రెట్టింపు చేసే వాటిలో ఇదీ ఒకటి.నిత్యం వంటల్లో ఫిష్ ఆయిల్ ను యాడ్ చేసి తీసుకుంటే.
గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.