తాజాగా టీమిండియా( Team India ) గెలిచిన విషయం తెలిసిందే.దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.ముఖ్యంగా నిన్నటి రోజు రాత్రి టీమిండియా గెలవడంతో టపాసులతో బాణా సంచాలతో పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకున్నారు క్రికెట్ ప్రియులు.
కాగా రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే.బార్బడోస్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో( T20 World Cup Finals ) సౌతాఫ్రికాపై విజయం సాధించింది.
ప్రపంచకప్ విన్నింగ్ మూమెంట్‌ను ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇప్పటికే పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలిపారు.అయితే సినీతారలు సైతం విన్నింగ్ మూమెంట్ తనదైన స్టెల్లో సెలబ్రేట్ చేసుకున్నారు.టాలీవుడ్ హీరో మంచు విష్ణు,(
Manchu Vishnu ) స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా( Prabhu Deva ) పూనకంతో ఊగిపోయారు.చివరి ఓవర్లో హార్దిక్ బౌలింగ్ చేస్తుండగా వరల్డ్ కప్ మనదే అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సందడి చేశారు.
దీనికి సంబంధించిన వీడియోను మంచు విష్ణు ట్విటర్లో పంచుకున్నారు.మ్యాచ్ ఓవర్ అంటూ విష్ణు సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆ వీడియో పై క్రికెట్ ప్రియులు సంతోషంగా స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే మంచి విష్ణు విషయానికొస్తే ప్రస్తుతం విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు పలువురు అగ్రతారలు కనిపించనున్నారు.ఇటీవలే కన్నప్ప టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు.