మణిపూర్ : భారత సంతతి ప్రొఫెసర్‌పై కేసు నమోదు.. ఖండించిన కుకీ విద్యార్ధి సంఘం

ఈశాన్య భారతదేశంలో కొన్ని తెగలను రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారంటూ భారత సంతతికి చెందిన ప్రొఫెసర్‌పై మణిపూర్‌లో కేసు నమోదవ్వడాన్ని కుకీ తెగకు చెందిన విద్యార్ది సంస్థ ఖండించింది. కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్( Kuki Students’ Organisation ) (కేఎస్‌వో) ఢిల్లీ చాప్టర్ ఈ రోజు ఓ ప్రకటనలో పోలీస్ చర్య ద్వారా బిరేన్ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వం కొన్ని వర్గాలను, వ్యక్తులను , సంస్థలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించింది.

 Kuki Students' Body Condemns Case Against Indian-origin Uk Professor ,kuki Stud-TeluguStop.com

నిందితుడిని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఉదయ్ రెడ్డిగా గుర్తించారు.ఇతను ఆన్‌లైన్ సందేశాలు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో చర్చా కార్యక్రమాల ద్వారా మణిపూర్‌లో కమ్యూనిటీల మధ్య ఉద్రిక్తతను సృష్టించడానికి పనిచేస్తున్నాడని మణిపూర్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

Telugu Indianorigin, Kuki, Manipur, Uday Reddy, Uk Professor-Telugu NRI

ఉదయ్ రెడ్డి.మణిపూర్‌( Manipur )లోని కుకీ-మెయిటీ కమ్యూనిటీల నిష్పాక్షికమైన అభిప్రాయాలను , ప్రామాణికమైన చరిత్రను స్ధిరంగా అందించారు.అతని అబ్జెక్టివ్, వాస్తవిక ప్రసంగం మెయిటీ ప్రచారకులను భయపెట్టింది.తప్పుడు సమాచారంతో అతని సత్యాలను ఎదుర్కోలేకపోతున్నారని కేఎస్‌వో ఓ ప్రకటనలో పేర్కొంది.సోషల్ మీడియాలో ఉదయ్ రెడ్డి ఎప్పుడూ మెయిటీ కమ్యూనిటీని దూషించలేదని సంస్థ వెల్లడించింది.ఉదయ్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ.

అతను ఉద్దేశపూర్వకంగా మెయిటీ విశ్వాసాలను అవమానించినట్లుగా ప్రచారం చేశారని కేఎస్‌వో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Telugu Indianorigin, Kuki, Manipur, Uday Reddy, Uk Professor-Telugu NRI

ఉదయ్ రెడ్డి( Uday Reddy )ని సైలెంట్ చేసేందుకు , కుకీ యువతకు మరింత విజ్ఞానాన్ని అందించకుండా నిరోధించడంలో భాగంగానే ఈ ఫిర్యాదు వచ్చిందని కేఎస్‌వో ఆరోపించింది.ఈ ఫిర్యాదులో నిజానిజాలు వెలికి తీయాలని ఆయన అధికారులను కోరుతున్నారు.ఈ ఫిర్యాదును తక్షణం ఉపసంహరించుకోవాలని కేఎస్‌వో డిమాండ్ చేసింది.

మణిపూర్ చారిత్రక, వర్తమాన అంశాలను వెలుగులోకి తీసుకురావాలని అనుకుంటున్న వ్యక్తులపై ఇలాంటి అన్యాయమైన చర్యలను నిలిపివేయాలని తాము కోరుతున్నామని కుకీ విద్యార్ధి సంఘం పేర్కొంది.కాగా.మే 2023 నుంచి మణిపూర్ సహా ఈశాన్య రాష్ట్రాలలో మెయిటీ- కుకీ సహా రెండు డజన్ల తెగల మధ్య హింస చెలరేగినప్పటి నుంచి సోషల్ మీడియాలో మాత్రం మాటల యుద్ధం నడుస్తోంది.నాటి అల్లర్లలో దాదాపు 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.

దాదాపు 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube