బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి

చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు.బాల కార్మికుల కనిపిస్తే 1098, డయల్ 100కు సమాచారం అందించండి.

 Everyone Should Join In Eradicating Child Labour, Rajanna Sirisilla District, Sp-TeluguStop.com

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.జూలై 1 నుండి 31-07-2024 వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్(Operation Muskan) లో పోలీస్ అధికారులు , చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, సిబ్బందితో జిల్లాలో రెండు టీమ్ లు ఏర్పాటు చేసి సమన్వయంతో విధులు నిర్వర్తించి జిల్లాలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం జరుగుతుందని ఎస్పీ సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

ఈసందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ….అన్ని శాఖల సమన్వయంతో పని చేసి ముస్కాన్-X కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ,0-18సంవత్సరాల లోపు తప్పిపోయిన, వివిధ రకాల బాల కార్మికులు వారు కిరాణం షాప్ లలో, మెకానిక్ షాపులలో, హోటళ్లలో పనిచేస్తూ మరియు వదిలివేయబడిన పిల్లలు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుంది.

చిన్న పిల్లలతో ఎవరైనా బలవంతంగా బిక్షాటన మరియు వెట్టి చాకిరీ చేయించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేయడం జరుగుతుందని, జిల్లాలో చిన్నపిల్లలతో పని చేపించే వారిపై నిత్యం నిఘా ఉంటుందని తెలిపారు.బాలల హక్కుల సంరక్షణ ద్వారానే సంపూర్ణ మానవ అభివృద్ది సాధ్యమవుతుందని,ఆదిశగా అధికారులు సమన్వయంతో పక్కా ప్రణాళిక రుపొందించుకోని బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేలా చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు.

జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికుల కనిపిస్తే 1098,డయల్ 100కు లేదా పోలీస్ లకు సమాచారం అందించాలని ,ఈ ట్రోల్ ఫ్రీ నంబర్స్ 24/7 అందుబాటులో ఉంటాయని తెలిపారు.చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి మొహంలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube