మనుషులు చేతులతో చేసే పనిని కాళ్లతో కూడా చెయ్యొచ్చు అంటుంది సబా గుల్, పాకిస్తాన్ కి చందిన ఈ చిన్నారి చేతులు లేని ఎందరో మనుషులకి ఆదర్శంగా నిలుస్తుంది, ఇంత చిన్న వయసులో ఈ చిన్నారి ఆత్మస్థైర్యాన్ని చూసి అందరూ గర్వ పడుతున్నారు.వివరాల లోకి వెళ్తే.
పాకిస్తాన్కు చెందిన ఈ బాలిక పేరు సబా గుల్.అయిదేళ్ల వయసు ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు రెండు చేతులూ కోల్పోయింది.అయితే, ఆమెలోని ఆత్మస్థైర్యం మాత్రం వీసమెత్తు కూడా చెదరలేదు.ప్రస్తుతం సబా వయసు 15 ఏళ్లు.“నాకు చేతులు లేవు.కానీ, కాళ్లు ఉన్నాయ్ కదా!” అంటూ అన్ని పనులనూ కాళ్లతోనే చక్కగా చేసేస్తోంది సబా.అందరితోపాటే బడికి వెళ్లి చదువుకుంటోంది.” బాగా చదువుకుని పాకిస్తాన్ సమాజంలో మార్పు తెస్తానని, మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తానని అంటోంది.
ఇంతకీ ఆమె చేతులు ఎలా కోల్పోయారు అంటే.అయిదేళ్ల వయసులో మేడ మీద తీగను రెండు చేతులతో పట్టుకుంది, కరెంటు షాక్ తగలడం తో చేతులు చచ్చుబడిపోయాయి, వెంటనే ఆసుపత్రి కి తీసుకువెళ్తే, డాక్టర్లకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు, వాళ్ళు ఆమె చేతులను తీసేసారు, అప్పటి నుండి ప్రతి పనిని కాళ్ళ తోనే చేస్తుంది.
ఆ ప్రమాదం జరిగినప్పుడు నాకు మూడు నెలల తమ్ముడు ఉన్నాడు.కొన్ని రోజులకు ఆస్పత్రి నుంచి ఇంటికి రాగానే వాడిని ఎత్తుకుని ముద్దాడేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లాను.
నాకు చేతులు లేవు కాబట్టి వాడిని ఎత్తుకోలేకపోతున్నానని అప్పుడు అర్థమైంది.కొంతసేపు అక్కడే నిలబడిపోయాను.
ఆ బాధను ఎప్పటికీ మరచిపోలేను.
లా చదివి మహిళల హక్కులు, మానవ హక్కుల కోసం పనిచేయాలని ఉంది.వివిధ ప్రాంతాలు తిరిగి మా సంస్కృతికి, వారి సంస్కృతులకు మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయో తెలుసుకోవాలని ఉంది.పాకిస్తాన్ సమాజంలో సానుకూల మార్పులు తేవాలని అనుకుంటున్నాను అని సబా గుల్ తెలిపారు.