సాధారణంగా కొందరికి లిప్స్‌పై పింపుల్స్ వస్తూ ఉంటాయి.డెడ్ స్కిన్ సెల్స్, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పోసకాల లోపం, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్స్ వాడటం, అదనపు జిడ్డు, బ్యాక్టీరియా, హార్మోన్ ఛేంజస్ ఇలా రకరకాల కారణాల వల్ల లిప్స్‌పై పింపుల్స్ ఏర్పడుతూ ఉంటాయి.
ఇవి చూసేందుకు అసహ్యంగా కనిపించడమే కాదు తీవ్రమైన నొప్పిని సైతం కలగజేస్తాయి.అయితే న్యాచురల్‌గా కొన్ని చిట్కాలను పాటిస్తే చాలా ఈజీగా పెదవులపై వచ్చిన పింపుల్స్‌ను నివారించుకోవచ్చు.
మరి ఆలస్యం చేయకుండా ఆ చిట్కాలు ఏంటో చూసేయండి.
లిప్స్‌పై వచ్చిన పింపుల్స్ ను తగ్గించడంలో ఆముదం అద్భుతంగా సహాయపడుతుంది.
ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆముదం, ఒక స్పూన్ కొబ్బరి నూనె తీసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని దూది సాయంతో పెదవులపై అప్లై చేసుకోవాలి.
రాత్రి నిద్రించే ముందు ఇలా చేసి.ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఇలా రోజూ చేస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోయి పెదవులు మృదువగా మారతాయి.
అలాగే గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ కస్తూరి పసుపు, ఒక స్పూన్ అలోవెర జెల్ వేసుకుని కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని లిప్స్‌కు అప్లై చేసుకుని.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం స్మూత్‌గా వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజూ చేసినా కూడా పింపుల్స్ తగ్గి.
లిప్స్ గ్లోగా, షైనీగా మారతాయి.
ఇక పెరుగుతోనూ ఈ సమస్యను నివారించుకోవచ్చు.
ఒక స్పూన్ పెరుగులో ఒక స్పూన్ బాదం ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదలకు అప్లై చేసి పావు గంట పాటు వదిలేయాలి.
అపై వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా ఉదయం, సాయంతం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.