బ్రహ్మంగారి కాలజ్ఞానం వల్ల ఏడాది పాటి సెన్సార్ చేయించుకోలేకపోయినా ఎన్టీఆర్ సినిమా !

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి( Potuluri Veerabramendraswamy ) వ్యాఖ్యలకు ఎన్టీఆర్( NTR ) చాలా ఆకర్షతుడయ్యే వారు.ఆయన చెప్పిన మాటలను తూచా తప్పకుండా పఠనం చేస్తుండేవారు.

 Indira Gandhi Actions Against Ntr ,potuluri Veerabramendraswamy Movie, Ntr, Mg-TeluguStop.com

అయితే తెరమీద బొమ్మలే పాలన చేస్తాయి అనే బ్రహ్మంగారి మాట ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించడంతో బ్రహ్మంగారి చరిత్రను సినిమాగా తీయాలని సంకల్పం చేసుకున్నారు.ఎన్టీఆర్ అనుకున్నదే తడవుగా కథ సిద్ధం చేసి సినిమా కూడా తీశారు.

ఎన్టీఆర్ లాంటి ఒక మహానుభావుడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమాగా తీస్తాను అంటే కాదు అనేవారు ఎవరైనా ఉంటారా.? కానీ అప్పటికే ఎన్నో మాస్ కమర్షియల్ ఐటెం నెంబర్స్ లాంటి సినిమాలు వస్తున్న సందర్భంలో ఇలాంటి ఒక జ్ఞానంతో కూడిన సినిమా తీస్తే జనాలకు నచ్చుతుందో లేదో అని అనుమానం మాత్రం కొందరిలో ఉండేది.

Telugu Mg Ramachandran, Tamil Nadu-Telugu Top Posts

విషయం ఏదయినా ఎన్టీఆర్ తలచుకున్నాక పని ఆగదు కాబట్టి ఆ సినిమా తీయనే తీశారు.విడుదలైన ఆరు రోజుల్లోనే కోటి రూపాయలు, లాంగ్ రన్ లో ఆరు కోట్ల రూపాయలను సంపాదించింది ఈ చిత్రం.అయితే ఇదే సినిమాలు తమిళనాడులో కూడా విడుదల చేయాలనుకున్నారు.అప్పటికి తెరమీద బొమ్మలు పాలన చేస్తాయి అన్న మాటకు ఎం జి రామచంద్రన్ ( MG Ramachandran )ఉదాహరణగా నిలిచారు.

ఆయన ముఖ్యమంత్రిగా తమిళనాడులో ఉన్నారు.అయితే ఈ విషయం ఆ నోట ఈ నోట కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసింది.

అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఈ సినిమాపై దృష్టి పెట్టారు.

Telugu Mg Ramachandran, Tamil Nadu-Telugu Top Posts

తెలుగులో సృష్టించిన ప్రభంజనం కూడా తెలుసుకున్నారు.దాంతో తమిళనాడులో( Tamil Nadu ) ఈ సినిమాను విడుదల చేయకూడదని ఆమె కంకణం కట్టుకున్నారు.అలా ఒక ఏడాది పాటు సెన్సార్ జరగకుండా సినిమా విడుదల కాకుండా ఆపగలిగారు.

కానీ ఆ తర్వాత ఎన్నో రోజులు ఆపలేరు కాబట్టి చివరికి ఈ సినిమా విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది.ఆయన నిజంగానే ఆ తర్వాత రోజుల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి మనందరికీ తెలిసిందే.

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేసి తొమ్మిది నెలలకే తెలుగువాడి అభిమానం అనే మాటతో అభిమానుల మనసులు గెలుచుకుని ముఖ్యమంత్రి అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube