చాలా రోజుల గ్యాప్ తర్వాత సాయి పల్లవి తనదైన తీరుతో తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరస సినిమాలను ఒప్పుకుంటుంది.ఇటీవల ఆమె తమిళ భాషలో శివ కార్తికేయన్ ( Sivakarthikeyan )సరసన ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు పరిచయం కాబోతోంది.
ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో చెబుతూ ఒక వీడియోను సినిమా బృందం రిలీజ్ చేయగా అందులో సాయి పల్లవిని చూసిన వారంతా కూడా ఆమె నటనకు ఫిదా అయిపోతున్నారు.సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తుందంటేనే కచ్చితంగా ఆ పాత్రకు ప్రాధాన్యత ఉండే ఉంటుంది అని అపోహలో ప్రేక్షకులు అంతా ఉన్నారు.
అయితే అమరన్ చిత్రంలో ఆమె నటిస్తున్న పాత్ర పేరు ఇందు రెబెకా వర్గీస్. ఈ సినిమాలో ఇందు ఒక ఆర్మీ మేజర్ అయిన ముకుంద్ వరదరాజన్ ( Mukund Varadarajan )భార్య పాత్రను నటిస్తుంది.
ముకుంద బయోపిక్ చిత్రం అంటూ ముందు ప్రకటించకపోయినా కూడా కొంత లిబర్టీ తీసుకొని అతడి బయోపిక్ ని తెరపై ఎక్కించాడు దర్శకుడు.
ఒక కరుడుగట్టిన తీవ్రవాదిని పట్టుకునే క్రమంలో జరిగిన ముఖాముఖి ఎన్కౌంటర్లో మేజర్ ముకుంద్ చాలా గాయాలపాలై ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు.చాలా ఏళ్లుగా ఆ ఉగ్రవాద నేతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ముకుంద్ చేసిన త్యాగం అనిర్వచనీయం.అతని బయోపిక్ ని సినిమాగా తీస్తున్నారు.
అందులో తన భార్య పాత్రలో సాయి పల్లవి నటించగా ముకుంద చిన్నతనం నుంచి కలిసి పెరిగిన ఇందు తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు వీరికి ఒక కుమార్తె కూడా ఉంటుంది.మొదట ఎంతో సరదాగా జీవితాన్ని గడిపిన ఇందు ని చూపిస్తూ అలాగే అతని మరణానంతరం అశోక చక్ర అందుకుంటున్న సాయి పల్లవిని చూపించారు ఈ వీడియోలో.
ఇండియాలోనే మోస్ట్ ఫియర్లెస్ ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలిటరీ అనే ఒక పుస్తకం నుంచి మేజర్ అయిన ముకుంద జీవిత కథనే సినిమాగా తీస్తున్నాడు ఈ చిత్ర దర్శకుడు రాజకుమార్ పెరియా స్వామి.సినిమాకు సంబంధించిన అనేక విషయాలను ముకుంద్ కుటుంబ సభ్యులను కలిసి సేకరించాడట.
ఈ వీడియో రిలీజ్ అయినప్పటి నుంచి సాయి పల్లవి అభిమానుల్లో సినిమాపై ఆసక్తి బాగా పెరిగింది.అలాగే ఈ సినిమా తర్వాత నాగచైతన్య సరసన తెలుగులో తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నారు సాయి పల్లవి హిందీ రామాయణంలో కూడా సీత పాత్రలో కనిపించబోతోంది.