పోయిన కొన్ని రోజుల క్రితం నాని నటించిన సరిపోదా శనివారం సినిమా( Saripodhaa Sanivaaram ) వచ్చింది.అది మన అందరికీ తెలిసిన విషయమే.
ఈ సినిమాలో హీరో నాని అయితే విలన్ పాత్రలో SJ సూర్య నటించాడు.కానీ చాలా మంది ఈ విషయాన్ని ఒప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.
ఎందుకంటే నాని పాత్ర కన్నా కూడా సూర్య చాలా అద్భుతంగా నటించాడు.అలాగే పాత్ర పనితనం కూడా అతనికి ఎక్కువగా కనిపించింది.
అందువల్ల నాని కన్నా కూడా సూర్య హైలైట్ అయ్యారు.మామూలుగా తెలుగు సినిమా హీరోలు నరుకుడు, కొట్లాటలు అంటే ఇష్టపడతారు.
అలాగే హీరో డామినేషన్ ఉండాలని ఉండాలని కచ్చితంగా కోరుకుంటారు.కానీ ఎందుకు నాని పూర్తి విరుద్ధం.
అందుకే తన అవసరం తగ్గించుకొని విలన్ పాత్రకు న్యాయం చేయాలని అనుకున్నాడు.మామూలుగా మన సౌత్ ఇండియన్ హీరోలు అంతా కూడా బిల్డప్పులకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు ఈగోకి పోయి తమ పాత్ర ఎక్కువగా ఉండాలనే అనుకుంటారు.నాని( Nani) తరహా లోనే ప్రస్తుతం మరొక హీరో కూడా అచ్చుగుద్దినట్టు ఇలాగే చేశాడు.ఇప్పుడు తమిళ హీరో కార్తీ సినిమా సత్యం సుందరం వచ్చింది.ఇందులో కార్తీ కన్నా కూడా అరవింద్ స్వామి ( Arvind Swamy )ఎక్కువగా ఎలివేట్ అవ్వడం విశేషం.కార్తీ అన్న సూర్య మరియు జ్యోతికలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం.
సొంత తమ్ముడు సినిమా అయినా సరే తమ్ముడి కన్నా కూడా అరవింద్ స్వామి చుట్టే కథను దింపే ప్రయత్నం చేశారు నిర్మాత అలాగే దర్శకుడు 96 సినిమాకి పనిచేసిన ప్రేమ్ కుమార్( Prem Kumar ).ఎక్కడా కూడా ఆ కథలో అవసరానికి మించిన సీన్స్ లేవు అలాగే సున్నితమైన కామెడీ ఎమోషన్స్ ఉన్నాయి కార్తీక్ కూడా అద్భుతంగా తన మెరిట్ కనపరిచాడు.అతడి కెరియర్ లో ఏదో ఒక అద్భుతమైన పాత్ర అని చెప్పుకోవచ్చు.
రోజా సినిమా తర్వాత ఎంతోమంది యువతులకు కలలు రాకుమారుడు అయిన అరవింద స్వామి చాలా క్లీన్ డామినేషన్ కనిపించింది ఈ సినిమాలో.అయినా కూడా ఎక్కడా ఎలాంటి ఫిస్టులు అనవసరమైన ఫీట్లు లేవు ఈ చిత్రంలో.చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ కామెడీతో సినిమాని తెరకెక్కించిన విధానం అద్భుతం.
ఈ సినిమా కొంచెం ప్రేక్షకుల కళ్ళల్లో పడితే ఖచ్చితంగా ఆ దేవర సినిమాను డామినేట్ చేస్తుంది.ఇక తెలుగులో డబ్బింగ్ వల్ల కొన్ని పదాలకు నాణ్యత లేకుండా పోతుంది కానీ పూర్తి స్థాయిలో చూసినట్టయితే బాగానే ఉంది.
సూర్య చాలా హడావిడిగా తెలుగులో స్టార్ హీరో అయిపోయాడు కానీ కార్తీ మాత్రం స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ వస్తున్నాడు.