అబుదాబి వేదికగా ఐఫా అవార్డు ( IIFA Awards )వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ అవార్డు వేడుకలలో భాగంగా సినీ తారులందరూ పాల్గొని సందడి చేస్తున్నారు.
కేవలం తెలుగు వారు మాత్రమే కాకుండా సౌత్ సెలబ్రిటీలతో పాటు నార్త్ ఇండియన్ సెలబ్రిటీలు కూడా అక్కడ పాల్గొని సందడి చేస్తున్నారు.ఇక ఈ వేడుకలలో కూడా చిరంజీవి అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.
ఈ వేడుకలలో భాగంగా చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ ముగ్గురు ఒకే వేదికపై కనిపించే అభిమానులను సందడి చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఎన్నో ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నాయి.
ఈ ఐఫా అవార్డు వేడుకలలో భాగంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.ఐఫా అవార్డులలో భాగంగా మాజీ ప్రపంచ సుందరి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) సైతం పాల్గొన్నారు.ఈ వేడుకలలో భాగంగా ఈమె కూడా ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు.మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ (Ponniyan Selvan) అనే సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమాలో ఈమె నటనకుగాను ఉత్తమ నటిగా అవార్డు లభించింది.
ఈ అవార్డు అందుకోవడం కోసం ఐశ్వర్యరాయ్ వేదిక పైకి వెళ్లారు అయితే బాలయ్య(Balayya ) చేతుల మీదుగా ఈమె ఈ అవార్డును అందుకున్నారు.ఇక వేదిక పైకి వెళ్ళగానే ఐశ్వర్యరాయ్ ఏ మాత్రం గర్వం లేకుండా ఆమె ఒక స్టార్ హీరోయిన్ అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి బాలయ్య పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ విధంగా బాలయ్య పాదాలకు ఐశ్వర్య రాయ్ నమస్కారం చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవ్వడమే కాకుండా ఐశ్వర్యరాయ్ వ్యవహార శైలి పట్ల అభిమానులు ఫిదా అవుతూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
నటిగా ఎంత ఎత్తుకు ఎదిగిన ఈమె ఒదిగే ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు.