భారీ అంచనాల నడుమ శుక్రవారం రోజున దేవర ( Devara )చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.అర్ధరాత్రి ఒంటిగంట సమయం నుండి అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తూ సినిమాను చూసేశారు.
అయితే ఈ సినిమాపై అభిమానులు కాస్త భిన్న స్వరాలను వినిపించారు.ఎన్టీఆర్ అభిమానులు సినిమాని మాత్రం సూపర్ హిట్ అని చెబుతున్న మరికొందరేమో.
అనుకున్నంత విధంగా లేదు అంటూ కాస్త పెదవి విరిచారు.దింతో సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది.
అయితే, సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు.ఇందులో భాగంగా ఎన్టీఆర్ దేవర సినిమాకి వస్తున్న స్పందన చూసి చాలా ఆనందం అవుతుందని.ఈరోజు కోసమే తాను ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్నానని.అభిమానులు అపురూపమైన స్పందనలతో చాలా ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ లో తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన దర్శకుడు కొరటాల శివకు, నిర్మాతలకు, డిఓపిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.అంతేకాకుండా సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ను అందించిన అనిరుద్ పై కూడా ఆయన ప్రశంసలు కురిపించాడు.
ట్వీట్ చివరలో అభిమానుల ప్రేమకు తాను ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ మిమ్మల్ని ఇలాగే ఆనంద పరుస్తానంటూ తెలిపారు.ఇక ఈ ట్వీట్ చూసిన జూ.ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ లైకుల వర్షం కురిపించేస్తున్నారు.మరి మొదటి రోజే ఎంతటి కలెక్షన్ రాబడుతుంది అంటూ అభిమానులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.
అయితే అక్కడక్కడ దేవర సినిమా షోలలో కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరిగాయి.