రామ్ చరణ్( Ram Charan ) హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్( Game Changer ) మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.ప్రేక్షకుల నుంచి ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే.
చరణ్ శంకర్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంతో పాటు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ట్రైలర్ ఒకే ఒక్కడు, భారతీయుడు సినిమాలను గుర్తు చేసే విధంగా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
డాకు మహారాజ్,( Daaku Maharaaj ) సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ట్రైలర్లు కూడా మెప్పిస్తే సంక్రాంతి సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.డాకు మహారాజ్ మూవీ ట్రైలర్( Daku Maharaj Trailer ) ఈ నెల 5వ తేదీన విడుదల కానుందని తెలుస్తోంది.
డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది.పాన్ ఇండియా మూవీ అయినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో పరిమితంగా థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.
గేమ్ ఛేంజర్ ట్రైలర్ ను మించి బాలయ్య( Balayya ) తన సినిమా ట్రైలర్ తో మెప్పిస్తాడా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.బాలయ్య బాబీ కాంబినేషన్ లో ఈ సినిమా తొలి సినిమా కాగా జై లవకుశ సినిమాతో ఎన్టీఆర్ కు హిట్ ఇచ్చిన బాబీ బాలయ్యకు ఏ రేంజ్ హిట్ ఇస్తారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది.సంక్రాంతికి వస్తున్నాం కూడా ష్యూర్ షాట్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.సంక్రాంతి సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరగగా ఈ సినిమాలకు ఏ స్థాయిలో కలెక్షన్లు వస్తాయనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.సంక్రాంతి సినిమాల కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.