నేడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్( NTR ) నటించిన దేవర సినిమా( Devara Movie ) రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఎక్కడ చూసినా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్స్ ముందు భారీ కటౌట్స్ పెట్టి సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు.
గురువారం రాత్రి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా లేదు.ఎక్కడ చూసినా కూడా భారీ కటౌట్స్, క్రాకర్స్ తో సంబరాలను జరుపుకుంటూ ఉన్నారు.
అయితే తాజాగా హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్( Sudarshan Theatre ) వద్ద ఉద్రికత్త వాతావరణం చోటు చేసుకుంది.అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కటౌట్( NTR Cut-Out ) గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని సమాచారంతో వెంటనే ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు.
అయితే కట్ అవుట్ కు నిప్పు పెట్టడం పై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పలు అనుమానాలు ఉన్నాయి అంటూ వాపోతున్నారు.ఇక ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.అయితే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది.దేవర సినిమా చూస్తూ మస్తాన్ వలి అనే వ్యక్తి మృతి చెందాడు.కడపలోని అప్సర థియేటర్లో ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో లో భాగంగా మస్తాన్వలి సినిమా చూసేందుకు వచ్చి కేకలు వేస్తూ ఫుల్ జోష్ గా ఎంజాయ్ చేశాడు.
కానీ, ఉన్నటువంటి ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి నేలపై పడ్డాడు.దీంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్( Janhvi Kapoor ) నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.ఇక సినిమాపై అభిమానులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.