Pawan Kalyan: తిరుపతి లడ్డు( Tirupathi Laddu ) వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆరోపణలు చేయడంతో ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ సెలెబ్రిటీలు కూడా స్పందించారు.
ఈ క్రమంలోనే నటుడు ప్రకాష్ రాజ్( Prakash Raj ) స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రకాష్ రాజ్ నాకు మంచి మిత్రుడు.
ఆయనంటే నాకు ఎంతో గౌరవం.రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒకరికి ఎంతో గౌరవం ఉంది.
నటుడిగా ఆయన్ని గౌరవిస్తా.తిరుపతి లడ్డు విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో పోస్ట్ పెట్టా.(దిల్లీలో మీ స్నేహితులంటూ) ఆయన ఆవిధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఆయన పోస్ట్ నాకు అర్థమైంది ఆయన ఉద్దేశం కూడా నాకు అర్థమైంది.ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ విజయవాడలోని ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ప్రకాష్ రాజు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు సనాతన ధర్మాన్ని కాపాడాలని అలా కాకుండా ఎవరైనా తప్పుగా మాట్లాడితే బాగోదు అంటూ తన స్టైల్ లోనే ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్లపై ఆయన కూడా ఘాటుగా స్పందించారు.
ఈ విధంగా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య తిరుపతి లడ్డు విషయంలో రోజురోజుకు మాటల యుద్ధం పెరుగుతుంది.తిరుమల శ్రీవారి లడ్డూలు ఎలాంటి కల్తీ జరగలేదని వైకాపా బలంగా చెబుతోంది ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) తిరుమల స్వామి వారిని దర్శించుకోవడం కోసం వెళ్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.ఇక పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టిన సంగతి తెలిసిందే.