టి. బిజేపి లో ఏం జరుగుతోంది ? నడ్డా టూర్ కి కారణం ఏంటి ? 

తెలంగాణలో బిజెపిని( Telangana BJP ) బలోపేతం చేసే విషయంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ గానే దృష్టి పెట్టింది.బీ ఆర్ ఎస్ ప్రజలకి పూర్తిగా దూరమైందని,  కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని ఇవన్నీ తమకు కలిసి వస్తాయని ,వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి గెలుస్తుందనే ఆశలతో ఆ పార్టీ అధిష్టానం ఉంది.

 What Is The Reason Behind Jp Nadda Telangana Tour Details, Jp Nadda Telangana To-TeluguStop.com

అందుకే ఎప్పటికప్పుడు తెలంగాణ బిజెపి నాయకులకు దిశనిర్దేశం చేస్తూనే వస్తోంది.  త్వరలోనే స్థానిక సంస్థలు,  జిహెచ్ఎంసి ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో , సభ్యత్వ నమోదు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

  స్థానికంగా బలంగా ఉంటే పార్టీ నిర్మాణం సులువు అవుతుందని భావిస్తున్న బిజెపి అధిష్టానం, సభ్యత్వం నమోదు ప్రక్రియను మొదలుపెట్టింది.తెలంగాణలో 50 లక్షల సభ్యత్వాలను సాధించాలని బిజేపి జాతీయ నాయకత్వం టార్గెట్ గా పెట్టింది.

 

అయితే ఇది అనుకున్న స్థాయిలో జరుగుతున్నాయా లేదా అనే అంశం పైన ఫోకస్ చేసేందుకు వీటికి ఇన్చార్జిగా అభయ్ పాటిల్ ను( Abhay Patil ) నియమించింది.అంతకంటే ముందుగా సభ్యత్వ నమోదు ఎలా చేపట్టాలి ? ఎంతమంది చేపట్టాలనే అంశం పైన రాష్ట్ర స్థాయిలో నాయకులకు , కార్యకర్తలకు సూచనలు చేశారు.అయినా అనుకున్నంత స్థాయిలో సభ్యత్వం నమోదు జరగకపోవడం వంటివి బిజెపి అధిష్టానానికి ఆగ్రహం కలిగిస్తున్నాయి.బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda ) ఈరోజు తెలంగాణ లో పర్యటించబోతుండడంతో బిజెపిలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని సాధించకపోవడంపై జేపీ నడ్డా తెలంగాణ బీజేపీ నాయకులకు క్లాస్ పీకుతారా లేక నాయకుల మధ్య సమన్వయం కోసం ఆయన వస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.  

Telugu Bjp National, Centralkishan, Congress, Kishan Reddy, Bjp, Telangana Bjp,

తెలంగాణలో బిజెపిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈనెల 8 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలుపెట్టింది .ఈ ప్రక్రియను ఈనెల 2 నుంచి మొదలు పెట్టాలని భావించినా వర్షాలు కారణంగా ఆలస్యంగా ప్రారంభించింది .ఈనెల 25వ తేదీ వరకు తెలంగాణలో 50 లక్షల సాధారణ సభ్యత్వం నమోదు చేయాలనే లక్ష్యంగా పెట్టారు.  అయితే ఎనిమిది లక్షల సభ్యత్వలు  మాత్రమే నమోదు కావడంతో , ఈ ప్రక్రియను మరికొన్ని రోజులు పాటు పొడిగించాలనే నిర్ణయానికి వచ్చారట.  పార్టీ ముందుగా నిర్ణయించుకున్న తేదీ ప్రకారం ఈనెల 25 వరకు సాధారణ సభ్యత్వాల నమోదు ప్రక్రియను నిలిపివేసి అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు క్రియాశీల సభ్యత్వాలు చేపట్టాలని ప్లాన్ చేసుకున్నారు.

  కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరడంలో భారీ వ్యత్యాసం ఉండడంతో,  ఈ విషయంలో బిజెపి అధిష్టానం ఆగ్రహంతో ఉందట. 

Telugu Bjp National, Centralkishan, Congress, Kishan Reddy, Bjp, Telangana Bjp,

ప్రస్తుతం తెలంగాణ బిజెపి అధ్యక్షుడు , కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి( Minister Kishan Reddy ) జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బిజీగా ఉండడంతో,  ఆయన సభ్యత్వ నమోదు పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయలేకపోతున్నారు.దీంతో పార్టీలోని ముఖ్య నేతలు సభ్యత్వ నమోదును సీరియస్ గా తీసుకోవడం లేదట.దీనికి తోడు పార్టీలో అంతర్గత విభేదాలు , వర్గ పోరు కారణంగా నష్టం జరుగుతోందని భావిస్తున్న బీజేపీ అధిష్టానం జేపీ నడ్డా ను వెంటనే తెలంగాణ పర్యటనకు వెళ్లాల్సిందిగా ఆదేశించారట .బిజెపి ఎంపీలు,  ఎమ్మెల్యేలు తో పాటు,  ఆ పార్టీ కీలక నేతలతో నేడు సమావేశమై కీలక సూచనలు చేయబోతున్నారట.  ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

సాయంత్రం ఐదు గంటలకు మహంకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తారు.ఆరు గంటలకు హోటల్ హరిత ప్లాజాలో పార్టీ ఎంపీలు , ఎమ్మెల్యేలు,  అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో నడ్డా సమావేశం అవుతారు.

ఈ సందర్భంగా అనేక కీలక సూచనలు చేయమన్నారట.మొత్తంగా తెలంగాణలో బిజెపిని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా బిజెపి అధిష్టానం ఫోకస్ పెంచుతోంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube