జగన్ తిరుపతి పర్యటన... పవన్ సూచన ఏంటంటే ?

వైసిపి అధినేత జగన్( YS Jagan ) నేడు తిరుమల తిరుపతి కి వెళ్ళనున్నారు .తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో జగన్ తిరుపతి పర్యటన రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

 Ap Deputy Cm Pawan Kalyan Comments On Ys Jagan Tirupati Tour Details, Tdp, Ttd,-TeluguStop.com

గత వైసిపి ప్రభుత్వం లో కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించారని టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంసంగా మారింది.ఈ విషయంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి వైసీపీని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తుండగా,  వైసిపి కూడా అంతే స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తూ,  మరింత రాజకీయ రచ్చ రేపుతున్నారు.

ఇదిలా ఉంటే నేడు జగన్ తిరుపతికి వెళ్ళనున్నారు.రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Telugu Apdeputy, Jagan Tirumala, Janasena, Janasenani, Pawan Kalyan, Tirumala La

జగన్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో , పోలీసులు అప్రమత్తం అయ్యారు.జగన్ తిరుపతి పర్యటనను కూటమి నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో,  తగిన భద్రత ఏర్పాట్లు చేపట్టారు.ఇక జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ) స్పందించారు.ఈ మేరకు కూటమి నేతలకు ఆయన కీలక సూచనలు చేశారు.

తిరుమల మహా ప్రసాదం లడ్డు తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు,  అలాంటి నేయి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టిటిడి బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని , అప్పటి టిటిడి బోర్డు ను నియమించిన వాళ్లు బాధ్యులే.హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డులో కల్తీపై వారే సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు.

Telugu Apdeputy, Jagan Tirumala, Janasena, Janasenani, Pawan Kalyan, Tirumala La

తిరుమల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న జగన్ విషయంలో ఆయన మతాన్ని,  ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడాల్సిన అవసరం సమయం ఇది కాదని,  వ్యక్తులను,  అన్యమాతలను లక్ష్యంగా చేసుకోవద్దని కూటమి శ్రేణులకు పవన్ కళ్యాణ్ సూచించారు.తిరుమల దర్శనానికి వెళుతున్న జగన్ నుంచి డిక్లరేషన్( Declaration ) తీసుకోవడం అనేది టీటీడీ అధికారుల బాధ్యత .ఈ విషయంపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు.డిక్లరేషన్ ఇస్తారా లేదా,  ఆలయ సాంప్రదాయాలు,  మర్యాదలు , నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్లే వ్యక్తి విచక్షణకు వదిలేయాలి.

  అధికారులు బాధ్యత గుర్తెరగాలి.ఈ విషయంలో వైసిపి కోరుకునేదే గొడవలే.

ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన,  అధికారంలోకి వచ్చాక కోనసీమ ఘటన సృష్టించి కులాల మధ్య చిచ్చు రేపే ప్రయోజనం పొందాలని చూసింది ఇప్పుడు మతాల మంట రేపాలని చూస్తోందని పవన్ మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube