యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ( Junior NTR, Koratala Siva ) కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం దేవర సత్తా చాటుతోంది.
అరవింద సమేత ( Aravinda Sametha Veera Raghava)ఫుల్ రన్ కలెక్షన్లను దేవర మూవీ ఒక్కరోజులో బ్రేక్ చేసిందంటే ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో సులువుగా అర్థమవుతుంది.ఈ సినిమాకు ఏకంగా 90 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చింది.
నైజాంలో 22 కోట్ల రూపాయల రేంజ్ లో సీడెడ్ లో 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఓవర్సీస్ లో 20 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన దేవర కర్ణాటకలో 7 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో మాత్రం దేవర కలెక్షన్లు పరిమితంగా ఉన్నాయి.
దేవర సినిమా( Devara movie )కు వచ్చిన కలెక్షన్లు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.దసరా పండుగ కానుకగా రిలీజ్ కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా తమకు ఎంతగానో నచ్చేసిందని చెబుతున్నారు.
ముఖ్యంగా దేవర రోల్ ను పవర్ ఫుల్ గా చూపించే విషయంలో కొరటాల శివ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు.దేవర మూవీ తెలుగు రాష్ట్రాల వరకు పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచే ఛాన్స్ ఉంది.
ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్ల విషయంలో థియేటర్ల ఓనర్లు సైతం సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.ఈ సినిమా తమకు మంచి లాభాలను అందిస్తోందని వాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
దేవర సినిమా ఫుల్ రన్ కలెక్షన్లతొ 200 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల మారును సులువుగానే అందుకుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.