అన్నం గంజి .. మీ అందాన్ని పెంచేస్తుంది

ఇప్పటి తరంలో చాలామందికి అసలు గంజి అనే పదానికి అర్థం ఏంటో కూడా తెలియదు అనుకుంటా.

అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దీన్ని "రైస్ వాటర్" అని అంటారు.

ఇంగ్లీష్ లో చెప్పాలంటే Porridge.దీని ద్వారా కొన్ని దేశాల్లో కొన్నిరకాల వంటకాలు కూడా చేసుకుంటారు లెండి.

గంజితో వచ్చే అద్భుత లాభాల గురించి తరువాత చెప్పుకుందాం కాని, ఈరోజైతే, గంజి మీ అందానికి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.* మొటిమలతో ఇబ్బందిపడ్డ వారికి ముఖంపై రంధ్రాలు ఏర్పడి ఉంటాయిగా.

కాటన్ ని గంజిలో ముంచి రోజు పడుతూ ఉంటె, మెల్లిగా ఆ రంధ్రాలు మూసుకుపోతాయి.* బాగా ఎండలో తిరిగితే చర్మం ట్యాన్ అవడం కూడా కామన్.

Advertisement

అలాంటప్పుడు చర్మానికి గంజిని పట్టి, ఓ అరగంట సేపు ఉంచేసి కడుక్కోవాలి.ఫలితం కనిపిస్తుంది.

* ముడతలు తగ్గించడానికి కూడా గంజి ఉపయోగపడుతుంది.కాని బద్ధకం లేకుండా రెగ్యులర్ గా వాడాలి.

* గంజి నీళ్ళలో కొంచెం పసుపు వేసి పడుతూ ఉండాలే కాని, మొటిమల వలన ఏర్పడిన మచ్చలు తగ్గుముఖం పట్టడం ఖాయం.* నల్లటి వలయాలపై కూడా పనిచేస్తుంది గంజి.

బ్లాక్ హైడ్స్ పై ప్రభావం చూపుతుంది.* గంజి పట్టడం వలన చర్మ తాజాగా ఉంటుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు చెక్ పెట్టే అద్భుత‌మైన ఆకుకూర‌లు ఇవే!

ఛాయను పెంచుతుంది.దాంతో మీరు అందంగా కనబడతారు.

Advertisement

తాజా వార్తలు