తమిళ్ స్టార్ హీరో అయిన కార్తీ( Karti ) నటించిన సత్యం సుందరం సినిమా( Satyam Sundaram movie ) ఈరోజు రిలీజ్ అయింది.అయితే ఈ సినిమాని దేవరకు పోటీగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ఈ సినిమాలో అరవింద సామి( Aravinda Sami ) ఒక కీలకపాత్రలో నటించాడు.మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ కి కార్తీ పోటీగా రావడం అనేది ఇప్పుడు ఎన్టీయార్ అభిమానులకు అంత బాగా నచ్చడం లేదు.
కార్తీ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది.అలాగే ఆయన వ్యక్తిత్వానికి చాలా మంది అభిమానులు ఉన్నారు.అందువల్ల ఆయన ఇక్కడ సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు.ఇక ఆయన చేసిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అన్ని సినిమాలను డబ్ చేస్తూ వస్తున్నారు.
అందులో కొన్ని సినిమాలు విజయం సాధిస్తే మరో కొన్ని సినిమాలు మాత్రం ప్లాప్ లుగా మిగులుతున్నాయి.ఇక ముఖ్యంగా ఆయన తెలుగులో చేసిన ఊపిరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక దాంతో ఆయనకు ఒక్కసారిగా తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది.ఇక సత్యం సుందరం సినిమాని ఈరోజు కాకుండా ఒక వారం రోజులు ఆగి సినిమా థియేటర్లోకి తీసుకొస్తే బాగుండదని సగటు ప్రేక్షకులు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే ఇప్పటికే దేవర సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.మరి దేవర సినిమాకి పోటీ గా కూడా ఈ సినిమా కాబట్టి సత్యం సుందరం సినిమాకి కొద్ది వరకైతే కష్టాలు కలుగుతున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకి కొంతవరకు నష్టం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు…కాబట్టి వీటన్నింటిని సరిగ్గా చూసుకొని సినిమా రిలీజ్ చేస్తే బాగుండేదని ఇప్పుడు సినీ విమర్శకులు కూడా వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…
.