బ్రిటన్ దేశానికి చెందిన సోషల్ మీడియా స్టార్ సామ్ పెప్పర్( Sam Pepper ) ఇటీవల భారతదేశం వచ్చినప్పుడు ఒక బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టి ఆ విషయాన్ని తెలియజేశాడు అదేంటంటే ఈ టూరిస్ట్ భాంగ్( Bhang ) డ్రింక్ తాగి ఫుడ్ పాయిజనింగ్‌కి( Food Poisoning ) గురయ్యాడు.
తర్వాత ఆస్పత్రిలో చేరవలసి వచ్చిందని తెలిపారు.మొదట ఆయనకు డ్రింక్ నచ్చినా, తర్వాత అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.
దీంతో ఆయన భారతదేశ పర్యటనను వాయిదా వేసి వెంటనే వైద్య సహాయం తీసుకోవాల్సి వచ్చింది.
సామ్ పెప్పర్ ఆసుపత్రి సిబ్బంది తన చికిత్సలో తప్పు చేశారని కూడా ఆరోపించారు.వారు IV డ్రిప్ వాల్వ్‌ను తెరిచి ఉంచడం వల్ల రక్తం అంతా రూమ్ లో చిమ్మిందని చెప్పారు.“నేను ఇండియాలో( India ) ఒక పెద్ద తప్పు చేశాను, దాని వల్ల ఆస్పత్రి పాలయ్యాను.17 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్న ఒక వీధి వ్యాపారి చేసిన భాంగ్‌ను తాగాను.రుచి బాగానే ఉంది, కానీ సాయంత్రానికి వాంతులు అయ్యాయి.
మరుసటి రోజు నాకు అధిక జ్వరం వచ్చింది.మందులు తీసుకున్న తర్వాత పరిస్థితి మరింత దిగజారింది, కడుపులో తీవ్రమైన సమస్యలు వచ్చాయి.” అని అతను తెలిపారు.
సామ్ పెప్పర్‌కు చాలా గంటలు అనారోగ్యంగా అనిపించిన తర్వాత, అతని స్నేహితులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు.అతని బాడీ టెంపరేచర్ 102.5 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంది.సామ్ మలం ఆకుపచ్చగా మారింది.IV ద్రవాలు, యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పటికీ, అతని ఆరోగ్యం మెరుగుపడలేదు.డాక్టర్లు తనకు ఏ రోగం అని నిర్ధారణ చేయలేకపోయారని, నర్సులు తన IV వాల్వ్‌ను తెరిచి ఉంచడం వల్ల తన ఆందోళన పెరిగిందని అతను చెప్పాడు.తనకు ప్రమాదం ఉందని భావించి, పరీక్షల కోసం బ్యాంకాక్‌కు వెళ్లాడు.
ఆ బ్రిటిష్ సెలబ్రిటీకి( British Celebrity ) జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది.కొంతమంది అయ్యో పాపం అని సానుభూతి చూపించారు.
మరికొందరు అతని మీద జోకులు చేస్తున్నారు.ఒకరు, “ఇండియా ఆహారం అందరికీ సరిపోదు, త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని రాశారు.
మరొకరు, “మొదటిసారి భాంగ్ తాగితే ఇలాగే అవుతుంది, పాపం” అని కామెంట్ చేశారు.మరికొందరు అతను వీధి ఆహారం తిన్నందుకు విమర్శించారు.
ఒకరు, “స్ట్రీట్ ఫుడ్‌కు బదులు మంచి రెస్టారెంట్లలో ఎందుకు తినలేదు?” అని అడిగారు.సామ్ పెప్పర్ వీడియోను కొన్ని గంటల్లోనే 71,000 మంది చూశారు.