ప్రస్తుతం వైసీపీ , ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) చుట్టూనే ఏపీ రాజకీయం తిరుగుతోంది.తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగింది అని, కల్తీ నెయ్యి ఉపయోగించారని, ఇదంతా వైసీపీ పెద్దల కమీషన్ల కక్కుర్తి వల్లే జరిగింది అని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జగన్ అలెర్ట్ అయ్యారు.
తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు జగన్ సిద్ధమయ్యారు.ఈరోజు తిరుమలకు( Tirumala ) చేరుకోనున్న జగన్ రేపు ఉదయం తిరుమల శ్రీవారి ని దర్శించుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
అయితే డిక్లరేషన్( Declaration ) ఇస్తే కానీ దర్శనానికి ఆయన్ను అనుమతించవద్దని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తుండడం , దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశం గా మారిన నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
![Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Jagan Tirumala, Pawan Kalyan, Telugudesh Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Jagan Tirumala, Pawan Kalyan, Telugudesh](https://telugustop.com/wp-content/uploads/2024/09/ttd-clarity-on-ys-jagan-tirumala-declaration-issue-detailss.jpg)
ఈరోజు తిరుమల పర్యటనకు వస్తున్న జగన్ రాత్రికి టీటీడీ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. రేపు ఉదయం గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి శ్రీవారి దర్శనం చేసుకుంటారు.అయితే జగన్ దర్శనం చేసుకోవాలంటే టీటీడీ నిబంధనల ప్రకారం హిందూ మతంపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది .దీంతో గెస్ట్ హౌస్ వద్ద ఆయన నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు .ఈ డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్ నిరాకరిస్తే ఆయనను దర్శనానికి అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించుకుంది.దీంతో ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం గెస్ట్ హౌస్ వద్దే డిక్లరేషన్ పత్రాలు తీసుకువెళ్లి జగన్ నుంచి సంతకాలు తీసుకోనున్నారు.
![Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Jagan Tirumala, Pawan Kalyan, Telugudesh Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Jagan Tirumala, Pawan Kalyan, Telugudesh](https://telugustop.com/wp-content/uploads/2024/09/ttd-clarity-on-ys-jagan-tirumala-declaration-issue-detailsd.jpg)
జగన్ సంతకం చేసేందుకు నిరాకరిస్తే దర్శనం చేసుకునేందుకు కుదరదని
టిటిడి
అధికారులు తేల్చి చెప్పబోతున్నారట దీంతో జగన్ డిక్లరేషన్ పై సంతకం చేస్తారా లేక మొండిగా ముందుకు వెళతారా అనే విషయం లో ఆసక్తి నెలకొంది.ఇప్పటికే బీజేపీతో పాటు , హిందూ సంఘాలు, టిడిపి, బిజెపిలు జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.జగన్ పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా డిక్లరేషన్ విషయంలో టిటిడి ఈ నిర్ణయం తీసుకోవడంతో జగన్ వైఖరి ఏ విధంగా ఉండబోతుందనేది చర్చనీయాంశం గా మారింది.