టాలీవుడ్ ఇండస్ట్రీలో అనిరుధ్( Anirudh Ravichander ) మ్యూజిక్ అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.కొన్ని సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ మైనస్ అయిందనే కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా వినిపించాయి.
అయితే అనిరుధ్ దేవర మూవీ కోసం ప్రాణం పెట్టి పని చేశాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
దేవర సినిమాలో సాంగ్స్ కానీ బీజీఎం కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.ఈ మధ్య కాలంలో మ్యూజిక్, బీజీఎం విషయంలో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన సినిమాలలో దేవర ఒకటి అని చెప్పవచ్చు.ఫియర్ సాంగ్, ఆయుధ పూజ సాంగ్, చుట్టమల్లే సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయ్.
యూట్యూబ్ లో చుట్టమల్లే సాంగ్( Chuttamalle Song ) కు ఏకంగా 141 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని సమాచారం అందుతోంది.గూస్ బంప్స్ వచ్చేలా మ్యూజిక్ ఉండటం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అయింది.
దేవర సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అనిరుధ్ కు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు రావడం పక్కా అని చెప్పవచ్చు.అనిరుధ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా రాబోయే రోజుల్లో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
దేవర సినిమాను చూసి అనిరుధ్ కాలర్ ఎగరేయడం గమనార్హం.దేవర సినిమా( Devara movie )లో కొన్ని సీన్స్ రిపీట్ అయ్యాయని కామెంట్లు వినిపిస్తుండగా ఫ్యాన్స్ మాత్రం ఆ కామెంట్లలో ఏ మాత్రం నిజం లేదని చెబుతుండటం గమనార్హం.అనిరుధ్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికినట్టేనని చెప్పవచ్చు.