60లో కూడా 20ల కనిపించాలనుకుంటున్నారా..? అయితే వీటిని పాటిస్తే చాలు..!

60 సంవత్సరాల వయసులో కూడా కొంతమంది యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు.మరి వారు అంత యవ్వనంగా కనిపించడానికి గల కారణం ఏమిటి? మీరు కూడా ఆరోగ్యంగా, ఫీట్ గా జీవించాలని అనుకుంటున్నారా.అయితే ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించాలని వైద్య నిపుణులు( Medical professionals ) చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, రోజు వారి వ్యాయామం చేయడంతో పాటు చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి.

 Want To Look 20's Even In 60's But Just Follow These , Medical Professionals, 20-TeluguStop.com

మరి రెగ్యులర్ లైఫ్ స్టైల్ లో పాటించాల్సిన అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే మీరు తినే ఆహారంలో ఎన్ని పోషకాలు కలిగి ఉన్నప్పటికీ ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోతే అసలు ఫలితం ఉండదు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరం ఎంత చురుగ్గా ఉంటే అంత ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.అందుకే క్రమం తప్పకుండా నడుస్తూ ఉండాలి.

వాకింగ్, ధ్యానం, యోగ, స్విమ్మింగ్( Walking, meditation, yoga, swimming ) లాంటి శరీరక కార్యకలాపాలు కొనసాగిస్తే శరీరం ఒత్తిడి హార్మోన్లను ఉత్పత్తి చేయకుండా నిరోధిస్తుంది.గుండె రక్త ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

ఇది అకాల మరణం అవకాశాన్ని దూరం చేస్తుంది.

Telugu Capsicum, Cauliflower, Green Peas, Tips, Legumes, Spinach, Yoga-Telugu He

ఇంకా చెప్పాలంటే క్యాప్సికమ్‌, బచ్చలికూర, చిక్కుళ్లు, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు( Capsicum, spinach, legumes, cauliflower, green peas ) లాంటి కూరగాయలు తప్పకుండా తీసుకుంటూ ఉండాలి.వీటిలో వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి.అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాటానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇవి చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతాయి.జీవితంలో ఎప్పుడూ కూడా సానుకూల దృక్పథంతో ఉండాలి.

ఇలా ఉండడం వల్ల ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.ఆరోగ్యంగా జీవించడానికి చెడు అలవాట్లను దూరంగా పెట్టడం ముఖ్యం.

Telugu Capsicum, Cauliflower, Green Peas, Tips, Legumes, Spinach, Yoga-Telugu He

ముఖ్యంగా ఆల్కహాల్, సిగరెట్ల కు దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది.అలాగే శరీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.వృద్ధాప్యం దరిచేరకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన నిద్ర ఉండాలి.అర్ధరాత్రి పని చేయడం, టీవీ, మొబైల్ ఫోన్లో సమయం గడపడం మానుకోవాలి.రోజు కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube