కుంకుమపువ్వు అంటే గర్భిణీ స్త్రీలకు మాత్రమే అని చాలా మంది భావిస్తుంటారు.కానీ, ఎవ్వరైనా కుంకుమపువ్వును తీసుకోవచ్చు.
ధర ఎక్కువే అయినప్పటికీ అందుకు తగ్గ పోషక విలువలు కుంకుమపువ్వులో దాగి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా కుంకుమపువ్వు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
అందులోనూ ఇప్పుడు చెప్పే విధంగా కుంకుమపువ్వును తీసుకుంటే గనుక బోలెడన్ని బెనిఫిట్స్‌ను మీ సొంతం చేసుకోవచ్చు.మరి లేటెందుకు అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ…

ముందుగా కుంకుమపువ్వును తీసుకుని మెత్తగా పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో పావు స్పూన్ కుంకుమపువ్వు పొడి వేసి ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి.ఈ కుంకుమపువ్వు వాటర్‌ను ప్రతి రోజు పరగడుపున తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
ముఖ్యంగా అధిక బరువుతో బాధ పడే వారు, బరువు తగ్గేందుకు ప్రయత్నించే వారు.రోజూ ఉదయాన్నే కుంకుమ పువ్వు నీటిని తీసుకోవాలి.తద్వారా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.అతి ఆకలి తగ్గుతుంది.
జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.ఫలితంగా మీరు సూపర్ ఫాస్ట్‌గా బరువు తగ్గుతాయి.
అలాగే రోజూ కుంకుమ పువ్వు వాటర్‌ను తీసుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉంటాయి.మీ చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా మెరుస్తుంది.

అంతేకాదు, ఉదయం పూట కుంకుమపువ్వు నీటిని తీసుకోవడం వల్ల రోజంతా ఫ్రెష్‌గా, యాక్టివ్‌గా ఉంటారు.ఒత్తిడి, తలనొప్పి, అలసట వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.రోగ నిరోధక శక్తి కూడా రెట్టింపు అవుతుంది.ఇక స్త్రీలును నెల సరి సమయంలో కుంకుమ పువ్వును నీటిని సేవిస్తే నడుము నొప్పి, కడుపు నొప్పి, కాళ్ల నొప్పి వంటివి తగ్గు ముఖం పడతాయి.