రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వచ్ఛత పనులతో అందరికీ ఆరోగ్యం ఆనందం సిద్ధిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్( Vemulawada MLA Adi Srinivas ) పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్, ఆగా ఖాన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం అగాఖాన్ ఫౌండేషన్‌తో కలిసి రుద్రంగి మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన “స్వచ్ఛత హీ సేవా” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ తీసి, స్వచ్ఛత హీ సేవపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఏక్ పేడ్ మాకీ నామ్ నాటడం కార్యక్రమంలో భాగంగా ఆ స్కూల్ ఆవరణలో ప్రభుత్వ విప్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.
విద్యార్థులకు స్వచ్ఛత ఈ సేవకు సంబంధించిన పెయింటింగ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
అనంతరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సఫాయిమిత్ర సురక్ష క్యాంపు నిర్వహించారు.సఫాయి కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
పలువురు పారిశుధ్య కార్మికులను సన్మానించి, ప్రభుత్వ విప్ మాట్లాడారు.ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సీజనల్గా వచ్చే రోగాలు దూరం అవుతాయని వివరించారు.
మొక్కలు నాటి సంరక్షిస్తే ఆరోగ్యం.పచ్చని చెట్లు ఆహ్లాదాన్ని పంచుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నటరాజ్, ఫౌండేషన్ ప్రతినిధులు సెల్వరాజ్, రమణి, ఎస్ బీ ఎం ఐఈసీ కన్సల్టెంట్ సురేష్, ఎంఐఎస్ కన్సల్టెంట్ బి ప్రేమ్ కుమార్, డీవై ఈఈ ప్రేమ్, వైద్య, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.