విద్యార్థినుల పేరుతో ఇంస్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురిపై కేసు నమోదు.

సోషల్ మీడియాలో వేదికగా మహిళల,విద్యార్థినుల(Women,students) పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, జిల్లాలో సత్పలితలు సాధిస్తూ మహిళలకు,విద్యార్థినులకు అండగ నిలుస్తున్నా జిల్లా షీ టీం, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ,మహిళలు, విద్యార్థినులు(District She Team, District SP Akhil Mahajan, Women, Students) వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

 A Case Has Been Registered Against Five People Who Have Created An Instagram Acc-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫెక్ ఐడి లతో ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్ (Instagram,Facebook , fake IDs)లు క్రియేట్ చేసి,లేదా మహిళల సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాక్ చేసి అసభ్యకర వీడియోలు, ఫోటోస్ పంపుతూ మహిళలు,విద్యార్థినుల వేధింపులు గురి అవుతున్న పిర్యాదులు ఎక్కవ వస్తున్నాయని,అలాంటి వేధింపులకు పాల్పడే పోకిరిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, సోషల్ మీడియా వేదికగా ఆడపిల్లలను,మహిళలను వేధించినా, అసభ్యంకర ఫొటోలు, వీడియోలు పంపిన, సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినా, మిత్రులకు షేర్‌ చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇలాంటి స్సమస్యలపై జిల్లా పోలీస్ నిఘా ఉంటుందని ఇలాంటి సమస్యలపై మహిళలు,విద్యార్థినులు నిర్భయంగా జిల్లా షీ టీమ్(She Team)_ కి పిర్యాదు చేయాలని తెలిపారు.

జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థినుల పేరుతో ఇంస్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి లేదా వారి అకౌంట్ హ్యాక్ చేసి వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురు పోకిరీలపై కేసు నమోదు చేయడం జరిగిందని,సోషల్ మీడియా వేదికగా కానీ,పని చేసే ప్రదేశాల్లో కానీ,పాఠశాలలో,కళాశాలల్లో మహిళలను ,విద్యార్ధినులకు వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని , మహిళలు ,విద్యార్థినులు వేధింపులకు గురైనట్లయితే వెంటనే డయల్ 100, లేదా షీ టీం నెంబర్ 87126 56425 కి పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,పిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube