ఎల్లారెడ్దిపేట మండల ( Yellareddypet )కేంద్రంలోనీ రాచర్ల గొల్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో డైనింగ్ హాల్ ఓపెన్ చేసి విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూసి విద్యార్థులను ఇబ్బందికి గురించేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపెల్లి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ… రాచార్ల గొల్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో గత ప్రభుత్వంలో డైనింగ్ హాల్ మంజూరు అయింది.
ఆ డైనింగ్ హాల్ ను అదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ నిర్మించారు కానీ విద్యార్థులను డైనింగ్ హాల్ లోకి వెళ్లకుండా అడ్డుకోవడం జరుగుతుంది.
అలా విద్యార్థులను డైనింగ్ హాల్ లోకి వెళ్ళానియ్యకపోవడానికి కారణం ఏమిటి అని ఎస్ఎఫ్ఐ నాయకులు అడగగా తను ఇచ్చిన సమాధానం తను స్వంత డబ్బులతో డైనింగ్ హాల్ నిర్మించాను నాకు ప్రభుత్వం నుండి ఇంకా బిల్లు రావడం లేదని ఆ బిల్లు వచ్చే వరకు నిను డైనింగ్ హాల్ ఓపెన్ చెయ్యను అని స్పష్టంగా చెప్పడం జరిగింది.
కావున జిల్లా కలెక్టర్ గారు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోని విద్యార్థుల డైనింగ్ హాల్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు డైనింగ్ హల్ లోకి వెళ్లకుండా చెట్ల క్రింద, వరండాలో కూర్చొని మధ్యాహ్నం భోజనం సమయంలో భోజనం చేస్తుండగా కోతులు దాడికి వస్తున్నాయని విద్యార్థులకు జరగకూడనిది జరిగితే ఎవరు భాద్యత తీసుకుంటారని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు బన్నీ విద్యార్థులు పాల్గొన్నారు.