బన్నీ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా... ఆ పాత్రలో నటిస్తే రికార్డుల మోత మోగాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా అడుగుపెట్టిన వారిలో అల్లు అర్జున్( Allu Arjun ) ఒకరు.తన ఫ్యామిలీ సపోర్ట్ తో గంగోత్రి సినిమాలో అవకాశం అందుకున్న ఈయన తదుపరి సినిమా అవకాశాలన్నింటిని తన టాలెంట్ ఆధారంగా అవకాశాలను అందుకోవడమే కాకుండా కెరియర్ పరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు.

 Allu Arjun Revealed His Dream Role To Play Power Full Police Officer Details, Al-TeluguStop.com

సినిమాలంటే ఎంతో పిచ్చి ఉన్నటువంటి అల్లు అర్జున్ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందించడంలో ఎప్పుడు ముందుంటారు.

ఇలా ఇప్పటివరకు ఈయన నటించిన ప్రతి సినిమాలో ఎంతో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక పుష్ప( Pushpa ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన అల్లు అర్జున్ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇందులో స్మగ్లర్ గా బన్నీ నటన అద్భుతమని చెప్పాలి.

ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రమైన పుష్ప 2( Pushpa 2 ) సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇలా ఇప్పటికే ఎన్నో యాక్షన్ సినిమాలలోను లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాలలో నటించిన అల్లు అర్జున్ కు ఒక డ్రీమ్ రోల్( Dream Role ) ఉందని తెలుస్తోంది.ఆయనకు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్( Police Officer ) పాత్రలో నటించాలని కోరిక ఉందట ఇప్పటికే రేసుగుర్రం( Racegurram ) సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఫుల్ లెన్త్ యూనిఫాంలో కనిపించలేదు.ఇలా ఫుల్ లెన్త్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం కోసం ఈయన ఇప్పటికే ఎన్నో కథలను విన్నారట కానీ ఆయన అనుకున్నంత డెప్త్ ఆ కథలో లేకపోవడంతో తన డ్రీమ్ రోల్ చేయలేకపోతున్నారని తెలుస్తోంది.

ఒకవేళ బన్నీ అనుకున్నట్టుగానే ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు అంటే రికార్డులు మోత మోగాల్సిందేనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube