లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకొని శాంతియుత ఎన్నికల నిర్వహణకు గత ఎన్నికల్లో జరిగిన లోతుపాటులు పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ.ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.

 Tight Security For Lok Sabha Elections District Sp Akhil Mahajan, Tight Security-TeluguStop.com

లోక్ సభ ఎన్నికలను పకద్భడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు.ఎన్నికల సంఘం నియంత్రణలో క్రమశిక్షణతో పని చేయాలన్నారు.

ఎన్నికలలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా చూసుకోవాలన్నారు.జిల్లాలో పరిధిలో ఏర్పాటు చేసిన చోట్ల చెక్ పోస్టులతో పాటుగా విజిబుల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యం ఇస్తూ డైనమిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యం అడ్డుకట్ట వేయాలన్నారు.

ఎన్నికల విధులకు సంబంధించిన నిర్దిష్టమైన సూచనలను తమ కింది స్థాయి సిబ్బందికి అందించాలన్నారు.క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బందికి కూడా ఎన్నికల నిబంధనల మీద అవగాహనను కల్పించడానికి సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు సంపూర్ణ పరిజ్ఞానం కల్పించాలన్నారు.

అధికారులు, సిబ్బంది గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రత చర్యలు చేపట్టాలన్నారు.పోలీస్ అధికారులు, సిబ్బంది తరచు పోలింగ్ కేంద్రాలకు సందర్శిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించే వ్యక్తుల మీద నిఘా వేసి ఉంచాలని సూచించారు.

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఓటర్లను ప్రలోభపరిచేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ,ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ

అక్రమ నగదు,మద్యం,ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ లో వాహనాల తనిఖీ, డైనమిక్ చెక్ పోస్ట్ లు పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.

లోక్ సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా పై దృష్టి సారించాలని, విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలు,ఫొటోలు షేర్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రాచారి, మురళి కృష్ణ, సర్వర్ , సి.ఐ లు రఘుపతి, సదన్ కుమార్, శ్రీనివాస్, వీరప్రతాప్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, మాధుకర్, ఆర్.ఐ లు యాదగిరి, మధుకర్,రమేష్, ఎస్.ఐ లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube