రాజన్న ఆలయంలో వైభవోపేతంగా రాములోరి కళ్యాణం నిర్వహిస్తాం - ఆర్డిఓ రాజేశ్వర్

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈనెల 09/04/2024 నుండి తేదీ.17/04/2024 వరకు రాజన్న ఆలయంలో శ్రీరామ నవరాత్రి ఉత్సవంలో సందర్భంగా అశేష భక్త జనానికి చేయవలసిన ఏర్పాట్లు గురించి శనివారం స్థానిక ఆర్డిఓ రాజేశ్వర్ అధ్యక్షతన చైర్మన్ గెస్ట్ హౌస్ లో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల చే సమావేశం ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలోపోలీసు శాఖ వారిచే రథోత్సవం, అన్ని ఇతర ప్రముఖ ప్రదేశాలలో కల్యాణ వేదిక వద్ద శాంతి భద్రతల నిర్వహణకు ఏర్పాట్లు చేయుటకు,వైద్య & ఆరోగ్య శాఖ వారిచేవైద్య శిబిరాల నిర్వహణ అంబులెన్స్ ఆరోగ్య సిబ్బందిని నియమించడం,వేములవాడ మున్సిపాలిటీ వారిచే పట్టణంలో పారిశుధ్య నిర్వహణ & తాగునీటి సరఫరా.టి.ఎస్.ఆర్.టి.సి.ప్రత్యేక బస్సులు నడుపుటకు,సెస్ వారిచే నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయుటకు, అగ్నిమాపక విభాగం దాని సిబ్బందితో పాటు ఫైర్ ఇంజన్లను ఉంచడం,

 Ramulori Kalyanam Will Be Conducted In Rajanna Temple With Grandeur Rdo Rajeshwa-TeluguStop.com

ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ వారిచే వేములవాడ (ముఖ్యంగా శ్రీ బద్ది పోచమ్మ దేవాలయం వద్ద), చుట్టుపక్కల గ్రామంలో మత్తు మందు అమ్మకాలపై నిషేధం విధించుటకు, దేవస్థానం నుండి యాత్రికుల బస ఏర్పాటు (చౌల్ట్రీలు, పెండల్స్) మొత్తం దేవస్థానం ప్రాంతంలో పారిశుద్ధ్యం, ధర్మ గుండంలో యాత్రికులకు సరఫరా చేసే క్యూ-లైన్ల భద్రతా చర్యలు, రథోత్సవం పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కోసం కల్యాణోత్సవం.మరియు అదనపు కార్మికుల నియామకం చేసి , మెయింటెనెన్స్ క్యూ లైన్ కోసం సత్యసాయి వాలంటీర్లను నియమించడం, క్యూ లైన్ వెంబడి, కల్యాణోత్సవం ప్రాంగణాల్లో, ఇతర అవసరమైన ప్రదేశాలలో యాత్రికులకు తాగునీటి సరఫరా చేయుటలు సూచించారు.

ఈసమావేశంలో రాజన్న ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్, డీఎస్పీ నాగేంద్ర చారి ఆలయ అధికారులు, మున్సిపాల్, మెడికల్, అధికారులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube