హత్య కేసులో నిందితుని అరెస్టు రిమాండ్ కు తరలింపు...

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈనెల రెండో తేదీన జరిగిన సిర్రం మహేష్ హత్య కేసులో నిందితుడైన దర్ర తిరుపతి నీ శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరిగింది.వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారీ తెలిపిన వివరాల ప్రకారం ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సిర్ర మహేష్ కి గత 12 సంవత్సరాలు క్రితం పద్మతో వివాహం జరగగా వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

 Accused In Murder Case Arrested And Moved To Remand, Accused ,murder Case ,arres-TeluguStop.com

గత మూడు సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య గొడవలతో భార్యతో విడిపోయి ప్రస్తుతం సిర్రం మహేష్ ఒంటరిగా ఉంటున్నాడు.గత సంవత్సరం నర నుండి మహేష్ వేములవాడలో బిల్డింగ్ మేస్త్రిల దగ్గర కూలీ గా పని చేస్తూ జీవిస్తున్నాడు.

గత ఆరు నెలల నుండి భగవంతరావు నగర్కు చెందిన బుట్టి శ్రీనివాస్ యొక్క రేకుల రూమ్ లో కిరాయికి ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు.కాగా భగవంతు రావు నగర్ కి చెందిన ధర్ర తిరుపతి కూడా బిల్డింగ్ మేస్త్రీల దగ్గర కూలీగా పని చేస్తూ సిర్రం మహేష్ తో స్నేహం ఏర్పడింది.

గత నాలుగు నెలల నుండి సిర్రమ్ మహేష్ రూమ్ లో దర్ర తిరుపతి ఉంటున్నాడు.కాగా తిరుపతి కూడా ఒంటరి జీవితం గడుపుతున్నాడు.ఇతనికి పెళ్లయి గొడవలతో భార్య చాలా రోజుల క్రితం వదిలిపెట్టి వెళ్ళిపోయింది.శిర్రం మహేష్ రూమ్ లో వుంటున్నందుకు కిరాయి డబ్బులు తిరుపతి ఇవ్వడం లేదు.

కిరాయి లేకుండా ఫ్రీ గా ఉంటున్నాడని సీర్రం మహేష్ దర్రా తిరుపతిని రోజు సూటి పోటి మాటలతో వేధిస్తున్నాడు.రూమ్ వుడ్వమని వంట చెయ్యమని తాగుడు ఎక్కువ అవుతుందని పని చేస్తలేవ్ ఎందుకని నిన్ను రూమ్ లో వుండనివ్వకుంటే నువ్వు పూట్ పాత్ మీద బతకాల్సి వస్తుందని రోజు మానసికంగా వేదించడంతో అతని వేదింపులు బుట్టి శ్రీనివాస్ కి చెప్పుకుంటూ దర్ర తిరుపతి బాధపడుతుండేవాడు.

మహేష్ తిరుపతిని అపుడపుడు మిగతా కూలీల ముందు చులకనగా మాట్లాడేవాడు.

అట్టి విషయం మనసులో పెట్టుకొని తిరుపతి మహేష్ ని ఎలాగైనా చంపాలని ఉద్దేశం తో తేదీ 01.04.2024 రోజున రాత్రి మహేష్ రూమ్ కి వెళ్ళి మృతునికి బాగా మద్యం త్రాగించి మృతుడు మద్యం మత్తులో ఉండగా నిందితుడు పెద్ద సిమెంట్ బండరాయి తీసుకువచ్చి మృతుని ముఖంపై పలుమార్లు కొట్టి చంపి అక్కడి నుండి పారిపోయినాడు.ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు నిందితున్ని చెక్కపల్లి రోడ్డు లో సబ్స్టేషన్ దగ్గర వేములవాడ ఇంచర్గ్ సిఐ శ్రీనివాస్, తమ సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా పట్టుకుని క్రైం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ పొదల్లో దాచిన రక్తపు మరకలు గల నిందుతుని బట్టలు, హత్యకు ఉపయోగించిన సిమెంట్ బండరాయిని స్వాధీనం చేసుకొని నిందితున్ని రిమాండ్ కు తరలించినామని వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారీ తెలిపారు.ఈ కార్యక్రమం లో ఇంచార్జి సిఐ శ్రీనివాస్,ఎస్ ఐ అంజయ్య పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube