రైతులను మోసం చేయడంలో రెండు పార్టీలు దొందు దొందే - మాజీ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా : రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్, భారాస పార్టీలు అని మాజీ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ పేర్కొన్నారు.మండల కేంద్రంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎండిపోయిన వరి పంటలను చూసి పోగా అదే ఎండిపోయిన వారి పంటను బిజెపి నాయకులు పరిశీలించారు.

 Both Parties Collude In Cheating Farmers Ex-cess Director Alladi Ramesh, Cheati-TeluguStop.com

ఈ సందర్భంగా బిజెపి నేత మాజీ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ మాట్లాడుతూ: కాంగ్రెస్ అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిందని,ఆరు గ్యారంటీల అమలులో ఎక్కడ కూడా రైతులకు న్యాయం జరగడం లేదని అన్నారు.ప్రభుత్వ ఏర్పడిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి చేయకపోవడం విడ్డూరమని అలాగే ఎకరానికి 15 వేల రూపాయలు, క్వింటాల్ కు 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచుతుందని,

రైతులకు నీరు ఇవ్వక పంటలు ఎండిపోయే పరిస్థితికి తీసుకువచ్చిందని అన్నారు.

అలాగే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరం వడగల్ల వర్షంతో పంటలు దెబ్బతినగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రామడుగు వచ్చి రైతులతో మాట్లాడుతూ తెల్లారే ఎకరానికి 10000 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పిన మాట ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు.భారాస ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీ సైతం అమలుగాక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారని, ఇప్పటికైనా రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పి వారికి తగిన గుణపాఠం చెప్పాలి అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, నాయకులు క్యాతము తిరుపతి రెడ్డి, కొనుకటి హరీష్, అనిల్, బోగోజి గంగాధర్,లు తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube