ప్రభుత్వ కళాశాలలో చేరండి -మెరుగైన విద్య అభ్యసించండి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి.మెరుగైన విద్యను అభ్యసించండి అంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి సదుపాయాల గూర్చి తల్లిదండ్రులకు విద్యార్థులకు వివరిస్తున్నారు.

 Government Junior College Teachers Door-to-door Campaign In Gambhiraopeta Mandal-TeluguStop.com

ఎల్లారెడ్డిపేట మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్.మోహన్ ఆదేశాల మేరకు శనివారం ఎల్లారెడ్డిపేట జూనియర్ కళాశాల అధ్యాపకులు గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో విద్యాభ్యాసాల ప్రవేశాల కొరకు, ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరడం ద్వారా విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్ సౌకర్యం కలదని విద్యార్థిని తల్లిదండ్రులకు విద్యార్థులకు తెలియజేశారు.

అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం చే కార్పొరేట్ కళాశాలలకు దీటుగా విద్యా బోధన జరుగుతుందని తెలిపారు.

విద్యార్థులకు విద్యతోపాటు సహ పాఠ్య కార్యక్రమాల్లో భాగంగా సాంస్కృతిక పోటీలు, క్రీడలు నిర్వహించడం జరుగుతుందని అవగాహన కల్పించారు.ఇప్పటివరకు వివిధ సాంస్కృతిక, క్రీడల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరడానికి సానుకూలంగా స్పందించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వాసరవేణి పరుశరాములు,మాదాసు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube