ఎల్లారెడ్డిపేట చార్మినార్ టైమ్స్ ప్రతినిధి మార్చి 02:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము లో బుధవారం ఐ ఎఫ్ టి యు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ మహాసభను నిర్వహించడం జరిగింది.ఈ మహాసభలో ఐఎఫ్ టి యు జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఐఎఫ్ టి యు సీనియర్ నాయకులు కామ్రేడ్ ఆకుల రాములు ను జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులు కుమ్మరవేని పరుశురాముులు, ప్రధాన కార్యదర్శి వేముల పరుశురాములు,సహాయ కార్యదర్శి తుడుం శ్రీకాంత్, కోశాధికారి ఎడవెల్లి దేవయ్యను, కార్యవర్గ సభ్యులుగా మందాటి మనేవ్వ ,పడాల స్రవంతి, దాసరి గణేష్ , రఘుపతి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్నికైన కమిటిచే ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.జనార్ధన్ ప్రతిజ్ఞ చేయించారు.
బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు గా మందాటి మనెవ్వ ఎన్నిక
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ 50 వ, స్వర్ణోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ మహాసభ జరిగింది.ఈ మహాసభ లో జిల్లా గౌరవాధ్యక్షునిగా ఆకుల రాములు , జిల్లా అధ్యక్షురాలిగా మందాటి మనెవ్వ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఉపాధ్యక్షులు శీల బాలకృష్ణ , ప్రధాన కార్యదర్శి వేముల పరుశురాములు , సహాయ కార్యదర్శిగా వాసవి రాజవ్వ, కోశాధికారిగా పాతూరి రాధ, కార్యవర్గ సభ్యురాలుగా ముగ్గు లక్ష్మి,చెక్కపల్లి రాజమణి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గం చే తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవా అధ్యక్షులు బి.భూమయ్య ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చింత భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.