ఉరుములు,పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు,బయటకు వెళ్లవద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని వీర్నపల్లి మండల ఎస్సై రమేష్ అన్నారు.నిన్నటి రోజున అకస్మాత్తుగా పిడుగులు పడడంతో జిల్లాలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని,వర్షాలు( Rains ) కురుస్తున్న సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని ఈదురు గాలులకు విద్యుత్ తీగలు కూడా తెగి మీదపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు.

 People Should Be Alert In View Of Thunder And Lightning Rains, Rajanna Sirisilla-TeluguStop.com

అంతేకాక వర్షాల దృష్ట్యా వాగులు, చెరువులు కుంటలు నిండుకుండ లాగా ఉంటాయి కావున చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు,యువత ఎవరూ వెళ్ళొద్దన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం కు డయల్100 సమాచారం ఇవ్వాలని అయన కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube